భారత చలనచిత్ర రంగం యొక్క ఖ్యాతిని పెంచిన సినిమాలలో “RRR” కూడా ఒకటి. ది గ్రేట్ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఈ ఏడాది మార్చి నెలలో విడుదలైన ఈ సినిమా ఏకంగా వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధించడం జరిగింది. పాండమిక్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా విడుదలైన సినిమాలలో అత్యంత హైయెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా “RRR” రికార్డు క్రియేట్ చేయడం జరిగింది. ఎన్టీఆర్ మరియు చరణ్ కలిసి నటించడం అదేవిధంగా “బాహుబలి” వంటి చరిత్ర సృష్టించిన సినిమా తీసిన దర్శకుడు రాజమౌళి సినిమా తీయటంతో… సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి.
ఇదే సమయంలో సినిమా టికెట్ రేట్లు పెంచుకునే దిశగా ప్రభుత్వాలు కూడా అనుమతులు ఇవ్వడం.. ప్లస్ అయింది. అన్ని రకాలుగా పాజిటివ్ వాతావరణంతో “RRR” విడుదలయ్యి సూపర్ విజయాన్ని అందుకుంది. సినిమా విడుదలయ్యాక సామాన్యుల మొదలుకొని సెలబ్రిటీలు అంతా.. జక్కన్న టేకింగ్ కి ఫిదా అయిపోయారు. కాగా నెట్ ఫ్లిక్స్ ఇంకా పలు ఓటీటి లలో విడుదలైన ఈ సినిమా హాలీవుడ్ ప్రముఖుల ప్రశంసలను అందుకోవటం జరిగింది.
ఇప్పటికీ కూడా “RRR” చూసి చాలామంది హాలీవుడ్ దర్శకులు టెక్నీషియన్ లు రియాక్ట్ అవుతూ సినిమా యూనిట్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమాని తాజాగా డిస్నీ హాట్ స్టార్ లో విడుదల చేయడం జరిగింది. జులై 26వ తారీకు నుండి డిస్నీ హాట్ స్టార్ లో “RRR” స్ట్రీమింగ్ అవుతోంది. నెట్ ఫ్లీక్స్ ఇంకా పలు ఓటీటి లలో మాదిరిగానే డిస్నీ హాట్ స్టార్ లో కూడా “RRR” భారీ ఎత్తున ట్రెండింగ్ లో నిలుస్తుంది అంట. డిస్నీ హాట్ స్టార్ లో విడుదలైన అన్ని సినిమాల కంటే “RRR” కి భారీ వ్యూస్ సాదిస్తున్నట్లు సమాచారం.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!