కాలం చాలా విలువైనది.. ఎవరికీ మరో అవకాశం ఉండదు. కానీ మరో అవకాశం ఇస్తే మాత్రం బ్యూటీ సమంత ఆమెలా మారిపోవాలనుకుంటుందట. ఇంతకు సమంత ఎవరిలా మారిపోవాలనుకుంటుందో తెలుసా!..సీనియర్ నటి లక్ష్మిలా. ఆమె తనలా మారిపోతుందని కూడా చెబుతుంది సమంత అక్కినేని. వీరిద్దరూ కలిసి నటిస్తున్న చిత్రం `ఓ బేబి`. నందినీ రెడ్డి దర్శకత్వంలో కొరియన్ చిత్ర మిస్ గ్రానీకి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రానికి ఓ బేబి అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ విషయాన్ని సమంత ట్విట్టర్ ద్వారా తెలిపారు. దీంతో పాటు “నాకు ఈ మార్గాన్ని ఎంచుకోవడం సహకరించిన దేవుడికి, నా చట్టు ఉన్నవారికి థాంక్స్. ఈ క్రమంలో నేను ఎన్నో ఎత్తు పల్లాలను చూశాను. వాటిని దాటి రావడం వల్లనే ఇప్పుడు సమయాన్ని ఆస్వాదిస్తున్నాను“ అంటూ మెసేజ్‌ను, `ఓ బేబి` సంబంధించిన కొన్ని స్టిల్స్‌ను పోస్ట్ చేశారు. ఈ వేసవిలో `ఓ బేబి` చిత్రం విడుదల కానుంది.
previous post
next post