Samantha: అందరికీ తెలిసిందే, మన ఇండియన్ ఇండీస్ట్రీలలో మిగతా వాటికన్నా ఎక్కువగా తెలుగు సినిమా ఇండస్ట్రీ హీరో, హీరోయిన్లకు ఎక్కువ రెమ్యూనిరేషన్లు ఇస్తుంది. అయితే ప్రస్తుతం బాహుబలి మహిమ తరువాత టాలీవుడ్ రేంజ్ పెరిగింది. దాంతో సినిమా ఆర్టిస్టుల రెమ్యూనిరేషన్ ఇంకాస్త ఎక్కువగా పెరిగింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఫామ్ లో ఉన్నటువంటి హీరోయిన్లకు మంచిగా ముట్టజెపుతున్నారు మన తెలుగు సినీ నిర్మాతలు. రష్మిక సుమారు 3 కోట్లు తీసుకుంటుందని టాక్ నడుస్తోంది.
Samantha: ఆ ప్రముఖ యంగ్ హీరోతో… ప్రేమలో సమంత..??
Samantha: సామ్ రెమ్యూనిరేషన్ ఇదే:
ఇక ఇలాంటి పరిస్థితులలో సమంత ఎంత తీసుకుంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాం. విడాకుల అనంతరం సామ్ మార్కెట్ అమాంతం పెరిగింది. వెబ్ సిరీస్ పుణ్యమాని సామ్ పాన్ ఇండియా హీరోయిన్ గా ఎదిగింది. దాంతో అమ్మడు దాదాపు 4, 5 కోట్లు వరకు టాలీవుడ్ నిర్మాతలను డిమాండ్ చేస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి. శాకుంతలం, యశోద అనే సినిమాలు కేవలం సమంత కీలకపాత్రతో తయారవడం విశేషం. సదరు సినిమా బడ్ఙెట్ దాదాపు 100 కోట్లుగా తెలుస్తోంది. ఇక అందులో సామ్ వాటా ఎంతో చెప్పాల్సిన పనిలేదు.
Samantha: గొడవలు వస్తాయని నాకు ముందే తెలుసు.. వైరల్గా సమంత పోస్ట్!
సామ్ సినిమా సమాచారం:సామ్ తాజాగా మైత్రీ మూవీస్ నిర్మాణంలో శివ నిర్వాణ డైరక్షన్ లో విజయ్ దేవరకొండ సరసన నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాట తెలిసినదే. ఇక ఈ పాన్ ఇండియా సినిమాలో నటించేందకు సమంతకు సుమారు 5 కోట్ల రెమ్యూనిరేషన్ ఇస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక ఇదే బ్యానర్ పుష్ప సినిమాను నిర్మించి, సామ్ కు ఓ సాంగ్ లో నర్తించే అవకాశాన్ని కల్పించింది కూడా. ఇక ఆ ఒక్క పాట కోసం కోటిన్నర ఇచ్చారని అందరికీ విదితమే. అలాంటప్పుడు సామ్ ఒక సినిమాకి గాను 5 కోట్లు తీసుకోవడంలో అతిశయోక్తి లేదని ఓ వర్గం వాదిస్తోంది.