NewsOrbit
సినిమా

సినీ ప్ర‌ముఖుల సంతాపాలు

అరుదైన ద‌ర్శ‌క న‌టీమ‌ణి శ్రీమ‌తి విజ‌య నిర్మ‌ల గారి హ‌ఠాన్మ‌ర‌ణం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “మ‌న తెలుగు ప‌రిశ్ర‌మ‌లో భానుమ‌తి గారి త‌ర్వాత గ‌ర్వించ‌ద‌గిన బ‌హుముఖ ప్ర‌జ్ఞాశాలి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు. తన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశారు. బాలనటిగా, కథానాయికగా.. దర్శకురాలిగా, నిర్మాతగా తన ప్రతిభాపాటవాలను చాటారు విజయనిర్మల.
అంత‌టి ప్రతిభావంతురాలిని మ‌నం ఇప్ప‌ట్లో ఇంకెవ‌రినీ చూడ‌లేం. కృష్ణ‌గారికి జీవిత భాగ‌స్వామినిగా ఎప్పుడూ ఆయ‌న ప‌క్క‌న నిల‌బ‌డి ఆయ‌న‌కు చేదోడు వాదోడుగా ఉంటూ త‌న ధ‌ర్మాన్ని నెర‌వేరుస్తూ వ‌చ్చారు. ఆమె లేని లోటు కృష్ణ గారికి ఆ కుటుంబానికే కాదు యావ‌త్ తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌కి తీర‌ని లోటు. వారి ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని, ఆ కుటుంబానికి ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తూ కృష్ణ‌గారికి, న‌రేష్ కి ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాల‌ని కోరుకుంటున్నాను అన్నారు మెగాస్టార్ చిరంజీవి.
            – చిరంజీవి

న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను సంపాదించుకున్న విజ‌య‌నిర్మ‌ల‌గారు క‌న్నుమూయ‌డం ఎంతో బాధాక‌రం. సినీ రంగ పరిశ్ర‌మ‌లో మ‌హిళా సాధికార‌త‌ను చాటిన అతి కొద్ది మంది మ‌హిళ‌ల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. నాన్న‌గారి `పాండురంగ మ‌హ‌త్యం` సినిమాలో కృష్ణుడిగా న‌టించారు. అదే ఆవిడ న‌టించిన తొలి తెలుగు సినిమా. బాలన‌టి నుండి హీరోయిన్‌గా కూడా ఎన్నో గొప్ప చిత్రాల్లో న‌టించారు. నాన్న‌గారితో మారిన మ‌నిషి, పెత్తందార్లు, నిండుదంప‌తులు, విచిత్ర‌కుటుంబం సినిమాల్లో న‌టించారు. అలాగే ద‌ర్శ‌కురాలిగా 44 చిత్రాల‌ను డైరెక్ట్ చేయ‌డం చాలా గొప్ప విష‌యం. ద‌ర్శ‌కురాలిగా గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించి ఎంతో మంది మ‌హిళ‌ల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. ఆమె మృతి చిత్ర‌సీమ‌కు తీర‌నిలోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని ఆ భ‌గ‌వంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.
    – నంద‌మూరి బాల‌కృష్ణ‌

ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత,మా ఆత్మీయురాలు.. శ్రీమతి విజయనిర్మల గారి ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించింది. విజయనిర్మల గారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
– యు.వి.కృష్ణంరాజు
విజ‌య‌నిర్మ‌ల‌గారి మ‌ర‌ణం దిగ్ర్భాంతిని క‌లిగించింది. కృష్ణ‌గారికి, నరేశ్‌గారికి నా ప్ర‌గాఢ సానుభూతిని తెలియ‌జేస్తున్నాను –ప‌వ‌న్ క‌ల్యాణ్‌

విజ‌య‌నిర్మ‌ల‌గారు అందించిన సినిమా క‌థ‌ల రూపంలో క‌ల‌కాలం నిలిచిపోతారు – రానా ద‌గ్గుబాటి

విజ‌య‌నిర్మ‌ల‌గారి జీవితం ఎంతో స్ఫూర్తిదాయ‌కం. ఆమె ఇక లేర‌నే వార్త విని దిగ్ర్భాంతికి లోన‌య్యా – తార‌క్‌
మా కుటుంబానికి ఎంతో భాదాక‌ర‌మైన రోజు. ఓ లెజెండ్‌, అంత‌కు మించి త‌ల్లిలాంటి వ్య‌క్తిని కోల్పోయాం. పురుషాధిక్యం ఉన్న ఈ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళ‌ల‌కు దారి చూపించారు. మ‌హిళా సాధికార‌త‌కు ఆమె ఓ చిహ్నంలా నిలిచిపోతారు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి
 – సుధీర్ బాబు
మనసున్న మనిషి అనడానికి నిలువెత్తు నిదర్శనం విజయనిర్మలగారు. ఎంతోమందికి సహాయం చేశారు. ఆవిడ ఒక లెజెండ్. లెజెండ్ అని అనిపించుకోవడానికి అన్ని అర్హతలు ఉన్న వ్యక్తి. మహిళలకు పెద్ద స్ఫూర్తి. నటిగా, దర్శకురాలిగా, నిర్మాతగా ఆవిడ సాధించిన విజయాలు అసామాన్యం. ఆవిడతో ఎవరినీ కంపేర్ చేయలేము. ఆ రోజు నుంచి ఈ రోజు వరకూ ఆవిడతో కంపేర్ చేయదగ్గ వాళ్లు ఎవరూ పుట్టలేదేమో. విజయ నిర్మలగారు దర్శకత్వం వహించిన చిత్రాల్లో ‘మీనా’ నాకు చాలా ఇష్టం. అది పక్కన పెడితే… ‘దేవుడే గెలిచాడు’ అని ఒక దెయ్యం సినిమా తీశారు. నా చిన్నప్పుడు వచ్చిన ఆ చిత్రాన్ని ఇప్పటికీ మర్చిపోలేను. అలాగే, ఆవిడ నటించిన ‘అల్లూరి సీతారామరాజు’ నాకు ఇష్టమైన చిత్రాల్లో ఒకటి. రీసెంట్‌గా కృష్ణగారి పుట్టినరోజుకి వాళ్లింటికి వెళ్లినప్పుడు ఆవిణ్ణి కలిశాం. అప్పటికి కొన్ని రోజులుగా ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్ లో ఉన్నారామె. అయినా మమ్మల్ని కలవడానికి వచ్చారు. ఆవిణ్ణి ఎప్పుడూ ఒక ఆడపులిలా చూసేవాళ్లం. అటువంటిది ఇబ్బంది పడుతూ నడవటం చూసి చాలా బాధగా అనిపించింది. ఇంత త్వరగా మనందరినీ విడిచి వెళ్లిపోతారని అనుకోలేదు. విజయనిర్మలగారి మరణం తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఇప్పుడు కృష్ణగారి గురించి ఆలోచిస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తోంది. ఆవిణ్ణి ఎక్కువగా మిస్ అయ్యేవ్యక్తి ఆయనే. ఒకరినొకరు అర్ధం చేసుకుని, ఒకరిని మరొకరు వదలకుండా అండ‌ర్‌స్టాండింగ్‌తో కృష్ణ, విజయనిర్మల దంపతులు ఉండేవారు. ఇద్దరి దాంపత్యం ఎంతోమందికి స్ఫూర్తి. కృష్ణగారికి, నరేష్ కి భగవంతుడు కొండంత ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా
– జీవితా రాజ‌శేఖ‌ర్‌
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు విజ‌య‌నిర్మ‌ల మ‌ర‌ణం తీర‌ని లోటు – క‌ల్యాణ్ రామ్‌

తెలుగు సినిమా ఇండ‌స్ట్రీని దిశానిర్దేశం చేసిన అతి కొద్ది మంది వ్య‌క్తుల్లో విజ‌య‌నిర్మ‌ల‌గారు ఒక‌రు. తెలుగు సినిమాపై న‌టిగా, ద‌ర్శ‌కురాలిగా, నిర్మాత‌గా ఆమె ప్ర‌భావం ఎంతో ఉంది. ఆమె ప్ర‌యాణం ఎంతో మందికి స్ఫూర్తి దాయ‌కం. ప్ర‌ప‌చంలోనే 44 చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఏకైక మ‌హిళా ద‌ర్శ‌కురాలు. గిన్నిస్ బుక్‌లో స్థానం సంపాదించి తెలుగు సినిమాకే గ‌ర్వ‌కార‌ణంగా నిలిచారు. మ‌హిళ‌ల్లో ఆమె లాంటి ఆల్ రౌండ‌ర్స్ అరుదు. ఇలాంటి వారిని ఇక చూడ‌లేం. విజ‌య నిర్మ‌ల‌గారి మ‌ర‌ణం సినీ ప‌రిశ్ర‌మ‌కు తీర‌ని లోటు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి. కృష్ణ‌గారికి, న‌రేశ్‌గారికి ఆ భ‌గ‌వంతుడు మ‌నోధైర్యాన్ని ప్ర‌సాదించాలి.
 – శ‌ర్వానంద్‌
ఓక వ్య‌క్తి గురించి ద‌శాబ్దాలుగా చెప్పుకుంటున్నాము అంటే ఆ వ్య‌క్తి చేసిన ప‌ని మాత్ర‌మే కాదు వారి గుణం, స్వ‌భావం. మూవీ ఆర్టిస్ట్ అసోసియెష‌న్ కి త‌న‌వంతు స‌హాయ‌న్ని ఇప్ప‌టికి శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారు అందిస్తున్నారనే వార్త నా హ్రుద‌యంలో బాగా నాటుకు పోయింది. ద‌ర్శ‌కురాలుగా సినిమాలు చేయ‌ట‌మే కాకుండా పేద క‌ళాకారుల‌కి స‌హ‌యం చేసే గొప్ప ల‌క్ష‌ణం త‌న సొంతం..ఛ‌లో చిత్రం లో న‌రేష్ గారితో న‌టించాను. విజ‌య‌నిర్మల గారి గురించి చాలా అడిగి తెలుసుకున్నాను. సినిమా సినిమా సినిమా ఇదే ప్ర‌పంచం గా వుండేవార‌ట‌.. ప్ర‌తి వారం ఏ సినిమా విడుద‌ల‌య్యింది. వాటి ఫ‌లితాలు ఎలా వున్నాయ‌నే డిస్క‌ష‌న్ శ్రీమ‌తి విజ‌య‌నిర్మల గారితో వుండేద‌ట అంతలా సినిమా ని ప్రేమించే వ్య‌క్తి ఈ రోజు తెలుగు సినిమా అభిమానుల్ని అంద‌ర్ని ఇలా వ‌దిలి వెళ్ళి పోవ‌టం చాలా దుర‌దృష్ట‌క‌రం.. శ్రీమ‌తి విజ‌య‌నిర్మ‌ల గారి ఆత్మ‌కి శాంతి క‌ల‌గాని కొరుకుంటున్నాను. అలాగే సూప‌ర్‌స్టార్ కృష్ణ గారికి, న‌రేష్ గారికి మ‌రియు వారి కుటుంబ స‌బ్యుల‌కి నా ప్ర‌గాఢ సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను.
 – నాగ‌శౌర్య‌

విజ‌య‌నిర్మ‌ల‌గారు సంతృప్తిక‌ర‌మైన జీవితాన్ని గ‌డిపారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎన్నోకీల‌క అంశాల్లో ఆమె మ‌ద్దతు తెలిపారు. ఆమె ఆత్మ‌కు శాంతి క‌ల‌గాల‌ని కోరుకుంటున్నాను – మంచు ల‌క్ష్మి
తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో మ‌హిళా టెక్నీషియ‌న్స్‌కు దారి చూపిన లెజెండ్ విజ‌య‌నిర్మ‌ల‌గారు. న‌టిగా, నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా ఎంతో మందికి ఆమె స్ఫూర్తిదాయ‌కం – స‌మంత‌
విజ‌య‌నిర్మ‌ల‌గారికి ఆత్మ‌కు శాంతి క‌ల‌గాలి, ఆమె కుటుంబానికి సంతాపాన్ని తెలియ‌జేస్తున్నాను – నాని

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Leave a Comment