బాలీవుడ్ సూపర్‌స్టార్స్‌లో ఒకరైన షారూఖ్‌ఖాన్.. త్వరలోనే దక్షిణాది సినిమాలో నటించబోతున్నారని వార్తలు వినపడుతున్నాయి. వివరాల్లోకెళ్తే.. తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకరైన విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓసినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఫుట్ బాల్ నేపథ్యంలో సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో షారూఖ్‌ఖాన్ నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారని టాక్. ఈయన పాత్ర సినిమా ఆసాంతం ఎక్కడా కనపడదట. చివరి 15 నిమిషాల్లో మాత్రమే కనపడుతుందని అంటున్నారు. షారూఖ్‌లాంటి టాప్ స్టార్ నటిస్తే ఈ సినిమాకు వచ్చే క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు నిర్మాత కల్పాతి అఘోరం. నయనతార హీరోయిన్గా నటిస్తోంది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
previous post
next post
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?