నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా ‘జెర్సీ’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నానికి జంటగా శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సెన్సిటివ్ లవ్ స్టోరీ తో క్రికెట్ బ్యాక్ డ్రాప్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో సమస్యలను, ఇబ్బందులను ఈ సినిమాలో అద్భుతంగా చూపించాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. గుండెలని పిండేసే కథ కథనాలతో రూపొందిన జెర్సీ ప్రేక్షకుల్నీ కట్టిపడేసిందని చెప్పాలి. ఇక సినిమాలో నాని, శ్రద్ధా శ్రీనాథ్‌ల నటనకు ప్రేక్షకులు ముగ్ధులైపోయారు. అంతేకాదు సినీ ప్రముఖుల నుంచి గొప్ప ప్రశంసలు దక్కాయి.
ఇక ఈ సినిమా తర్వాత శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో యంగ్ హీరోల సరసన వరసగా సినిమాలు వస్తాయనుకుంది. తనే కాదు ప్రేక్షకులు అదే భావించారు. కాని ఎందుకనో శ్రద్ధా శ్రీనాథ్ కి క్రేజీ ప్రాజెక్ట్స్ లో అవకాశాలు రాలేదు. ఇక ఇదే సినిమాని బాలీవుడ్ లో నిర్మించబోతున్నారు. అక్కడ కూడా శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్ అన్న ప్రచారం జరిగింది. కాని అధికారకంగా మాత్రం బాలీవుడ్ మీడియా నుండి వెల్లడి కాలేదు.
అయితే అందుకు కారణం శ్రద్ధా శ్రీనాథ్ జెర్సీ లో చాలా పద్దతిగా నటించడం అని అంటున్నారు. ఒక బిడ్డకి తల్లిగా నటించడం కూడా మైనస్ అయిందన్న టాక్ వచ్చింది. అంతేకాదు కంప్లీట్ ట్రెడీషనల్ వేర్స్ లో పెద్ద దానిలా కనిపించిందని తనలో గ్లామర్ యాంగిల్ లేదని మాట్లాడుకున్నారు. కాని రీసెంట్ గా రిలీజైన క్రిష్ణ అండ్ హీస్ లీల సినిమాలో మాత్రం శ్రద్ధా శ్రీనాథ్ రెచ్చిపోయింది. హాట్ సీన్స్ అండ్ బెడ్రూం సీన్స్ లో చూసిన ప్రతీ ఒక్కరు శ్రద్ధా శ్రీనాథ్ లో ఈ యాంగిల్ కూడా ఉందని ఊహించలేదే అని మాట్లాడుకుంటున్నారు. మరి ఈ సినిమాతోనైనా శ్రద్ధా శ్రీనాథ్ టాలీవుడ్ లో సెటిలవుతుందేమో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!