ప్రతి ఒక్కరికీ కోరికలుంటాయి. ఫలానా వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనో, ఫలానా ఎత్తుకు ఎదగాలనో, జీవితంలో గట్టిగా అనుకున్నది ఏదో సాధించాలనో… ఇలా మనిషి మనిషికీ కోరికలుంటాయి. అలా తాప్సీకి కూడా కోరికలున్నాయి. తాప్సీ చెప్పిన కోరిక వింటే చాలా వింతగా ఉంటుంది. ఆమెకు హాలీవుడ్ పార్టీలకు వెళ్లాలని ఉందట. ఫ్యాన్సీగా జరిగే హాలీవుడ్ పార్టీలకు దర్శకుడు అనురాగ్ కశ్యప్‌తో కలిసి ఆయన బెస్ట్ ఫ్రెండ్‌గా వెళ్లాలని ఉందని చెప్పింది. ఇటీవల బాలీవుడ్ లో జరిగిన ఓ టాక్ షోలో ఈ విషయాన్ని వ్యక్తం చేసింది. సౌత్ ఇండియాలో మంచు మనోజ్ సరసన నాయికగా కెరీర్ మొదలుపెట్టిన తాప్సీ ఇప్పుడు బాలీవుడ్లో ఎంత స్టార్ హీరోయిన్గా, సోలో హీరోయిన్గా పేరు తెచ్చుకుంటుందో కళ్లారా చూస్తూనే ఉన్నాం. ఈ ఢిల్లీ భామ మాట్లాడుతూ “నాకు జాక్వలిన్ ఫెర్నాండెజ్‌తో కలిసి పోల్ డ్యాన్స్ కూడా చేయాలని ఉంది. ఆమె మా పక్కింట్లో ఉంటే తప్పకుండా ఆమెతో కలిసి వర్కవుట్లు కూడా చేస్తాను. ఆమె వర్కవుట్ చేసే తీరు నాకు బాగా నచ్చుతుంది“ అని కూడా చెప్పుకొచ్చింది. సో తాప్సీ పార్టీ కల త్వరగా నెరవేరాలని కోరుకుందాం.
previous post
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!