ఇండియన్ విమెన్ టీమ్ ని లీడ్ చేసిన మిథాలీరాజ్ పాత్రలో తాప్సీ నటిస్తారని గత కొంతకాలంగా వార్తలు వెలువడుతున్నాయి. తాజాగా అది నిజమేనని అభిజ్ఞవర్గాల సమాచారం. మాజీ క్రికెటర్ మిథాలీ రాజ్ గురించి తెలియని వారు ఉండరు. తమిళ కుటుంబానికి చెందిన ఆమె రాజస్థాన్‌లో పెరిగారు. ఆమెతండ్రి రక్షణా దళంలో పనిచేశారు. ఇండియన్ విమెన్ క్రికెట్ టీమ్‌లో ఆమె అత్యధిక అర్ధసెంచరీలు కొట్టిన మహిళగా పేరు తెచ్చుకున్నారు. అంతర్జాతీయంగా ఎక్కువ పరుగులు తీసిన మహిళగా కూడా ఆమె పేరు మీద రికార్డు ఉంది. ఈ నేపథ్యంలో ఆమె కథతో తాప్సీ సినిమా చేయనున్నారు. తాప్సీ క్రీడా చిత్రాలు చేయడం కొత్తేమీ కాదు. ఆమె ఇది వరకే హాకీ ప్లేయర్‌గా నటించారు. మరో చిత్రంలో షార్ప్ షూటర్‌గా చేస్తున్నారు. క్రికెటర్‌గా చేయడం మాత్రం ఇదే తొలిసారి. ఆమె నటించిన `బద్లా` ఇటీవల విడుదలైంది. ఇటీవల తాప్సీ నటించిన చిత్రం `గేమ్ ఓవర్`కు తెలుగునాట మంచి స్పందన లభించింది. దాంతో వైవిధ్యమైన సినిమాలను ఎంపిక చేసుకుంటూ ముందుకెళ్తోంది తాప్సీ.
previous post
next post
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!