NewsOrbit
సినిమా

SVP: సర్కారు వారి పాటలో జగన్ డైలాగ్ పెట్టడానికి అసలు కారణం అదేనట!

SVP: టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ – మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈనెల 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలకాబోతోంది. ఇంతకుముందే ట్రైలర్ విడుదలై యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. లవ్, రొమాన్స్, యాక్షన్ ప్యాక్డ్ కలగలసిన సినిమా అని ఆ ట్రైలర్ చూసిన ఎవరికన్నా ఇట్టే అర్ధం అయిపోతుంది. అయితే ఈ ట్రైలర్ లో భాగంగా వినపడింది ”నేనున్నాను.. నేను విన్నాను” అనే డైలాగ్ గురించి ఇపుడు ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ డైలాగ్ ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి కాపీ చేసారని చాలామందికి తెలిసినా… ఆ డైలాగ్ మహేశ్ బాబుపై, దర్శకుడు పరశురాంపై వైఎస్ జగన్ ప్రభావం తప్ప వేరొక కారణం ఏదీ లేదని కొట్టి పారేస్తున్నారు.

దానికేనా ఆ డైలాగ్ మంత్రం?

ఇక ఇదే విషయమై AP రాష్ట్రానికి చెందిన పలువురు MLAలు, మంత్రులు కూడా చర్చించుకున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇది నిజమేనా? అని పరశురామ్ నే అడిగితే.. అతడు చెప్పిన ఆన్సర్ ఇదట… దివంగత ముఖ్యమంత్రి YS రాజశేఖర్ రెడ్డిపై ఉన్న ప్రేమ కారణంగానే ఈ డైలాగ్ ఉంచినట్లు స్పష్టం చేశారట. తాను YS రాజశేఖర్ రెడ్డికి ఫాలోవర్ ని అని, ఆయన చెప్పిన డైలాగ్ ని నిజంగా ఇష్టపడ్డానని దర్శకుడు పరశురామ్ తాజాగా ఓ మీడియా వేదికగా వెల్లడించాడు. దాంతో మహేష్ – కీర్తి మధ్య ఓ సన్నివేశంలో దానిని ఉపయోగించాలనే ఉపయోగించానని తెలిపారు.

దానికి ఆ డైలాగ్ అవసరం అట!

సినిమాలో భాగంగా ఆ సన్నివేశంలో హీరో గారు.. హీరోయిన్ కీర్తికి ఓ హామీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఈ డైలాగ్ రాస్తే బాగా పేలుతుందని అనిపించి పెట్టారట. ఇక అసలు సంగతి పెరుమాళ్ళకెరుకగాని, ఆ డైలాగ్ విని YSR పార్టీ నేతలు, కార్యకర్తలు మాత్రం ఫుల్ ఖుషిలో వున్నారు. అయితే ఈ క్రమంలో సదరు చిత్ర యూనిట్ పైన కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ ను మెప్పించడానికే ఆ డైలాగులు రాసారని అనేవారు లేకపోలేదు. ఇక కొంతమందైతే ఒక సినిమా వాడు ప్రభుత్వాన్ని మెప్పించే దుస్థితికి దిగజారిపోయాడంటూ అనుకుంటున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Savitri: మాతృదేవత సినిమా హిట్ అయిన అప్పుల్లో కూరుకుపోయిన సావిత్రి.. ఎందుకు..?

Saranya Koduri

Indraja: సినీ యాక్టర్ ఇంద్రజ ని హీరోయిన్గా ఎదగనివ్వకుండా ఆపిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Saranya Koduri

Brahmamudi April 13 2024 Episode 383:  బిడ్డతో ఫంక్షన్ కి వెళ్లిన కావ్య.. వెన్నెల ఎంట్రీ.. రుద్రణి ప్లాన్ కనిపెట్టిన స్వప్న

bharani jella

Krishna Mukunda Murari April 13 2024 Episode 444: భవానీ నిర్ణయానికి గింగిరాలు తిరిగిన ముకుంద.. కృష్ణ మురారి సంతోషం.. రజనీతో కలిసి ముకుంద ప్లాన్..

bharani jella

Jayasudha: వాట్.. సీనియర్ యాక్టర్ జయసుధ తల్లి హీరోయినా?.. ఏ ఏ సినిమాల్లో నటించిందంటే..!

Saranya Koduri

Nuvvu Nenu Prema April 12 2024 Episode 597: పోలీస్ స్టేషన్ కి కుచల.. కృష్ణ ఆవేశం.. రౌడీలకు లొంగిపోయిన విక్కీ.. పద్మావతిని కాపాడనున్నాడా?

bharani jella

Naga Panchami: పంచమి బిడ్డ గురించి గురువుగారు ఏం చెప్పు తలుచుకున్నాడు.

siddhu

SS Rajamouli: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ యాడ్ లో రాజమౌళి.. వీడియో వైరల్..!!

sekhar

Madhuranagarilo April 12 2024 Episode 336: శ్యామ్ ని జైల్లో వేయించిన రుక్మిణి…

siddhu

Pawan Kalyan: రామ్ చరణ్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

sekhar

OTT Releases: ఒకేరోజు ఓటీటీలోకి సందడి చేసేందుకు వచ్చేసిన 3 సూపర్ హిట్ మూవీస్.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Kajal Karthika OTT Review: కాజల్ కార్తీక ఫస్ట్ రివ్యూ.. సెకండ్ ఇన్నింగ్స్ లో కాజల్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Razakar OTT Release: ఓటీటీ లోకి వచ్చేస్తున్న బోల్డ్ బ్యూటీ అనసూయ ” రాజాకార్ ” మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Most Watched Korean Dramas OTT: ఈ మధ్యకాలంలో ఓటీటీలో ఎక్కువ మంది వీక్షించిన మోస్ట్ కొరియన్ డ్రామాస్ ఇవే..!

Saranya Koduri

2024లో ప్రేమించి పెళ్లి బంధంతో ఒకటవనున్న సీరియల్ యాక్టర్స్ వీళ్లే..!

Saranya Koduri