RC16: డైరెక్టర్ బుచ్చిబాబు తన మొదటి సినిమా ఉప్పెనతో తన టాలెంట్ ఏంటో నిరూపించారు. ఈ క్రమంలో రెండో సినిమా ఎన్టీఆర్ తో చేస్తారని వార్తలు రాగా రామ్ చరణ్ తో ప్రకటించడం జరిగింది. “RC16” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేపథ్యం కలిగిన స్టోరీతో ఈ సినిమా షూటింగ్ జరుపుకోనుంది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన యాసతో ఈ సినిమాలో సంభాషణలు ఉండబోతున్నాయి. దీంతో అదే ప్రాంతానికి చెందిన వారిని నటింప చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే… ఆడిషన్స్ జరుగుతున్నాయి.
ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి రెగ్యులర్ షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మేటర్ లోకి వెళ్తే మే 16వ తారీకు నుంచి “RC16” సినిమా షూటింగ్ జరుపుకోనుందట. ఇందుకోసం జూబ్లీహిల్స్ లో ఓ భూత్ బంగ్లా సెట్ ను మూవీ టీం ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే రెండు సాంగ్స్ కూడా కంప్లీట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. పాన్ వరల్డ్ తరహాలో ఈ సినిమా రూపొందిస్తున్నారట. రామ్ చరణ్ నటించిన “RRR”… 2022 మార్చి నెలలో విడుదల అయింది.
రెండు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు మరో సినిమా రిలీజ్ కాలేదు. శంకర్ దర్శకత్వంలో మొదలుపెట్టిన “గేమ్ చేంజర్” షూటింగ్ కూడా చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంది. ఈ సినిమా ఈ ఏడాదిలో విడుదల కావడం డౌటే. దీంతో “RC16” షూటింగ్ విషయంలో చరణ్ ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారట. ఎట్టి పరిస్థితులలో షూటింగ్ త్వరగా కంప్లీట్ అయ్యేవిధంగా షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడం జరిగిందట. ఇప్పటికే ఈ సినిమా కోసం మేకవర్ మార్చుకున్నారు. ఇదే సమయంలో బాడీ షేప్ మార్చుకోవడానికి కొన్ని వర్క్ అవుట్స్ కూడా చేస్తున్నట్లు సమాచారం.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!