Krishna Mukunda Murari February 17 2024 Episode 396: మురారి కృష్ణతో నువ్వు పెద్దమ్మ ఇచ్చిన బొమ్మను చూస్తూ ఉండటమే కాదు తను చెప్పిన మాటను కూడా నెరవేర్చాలి అని అంటాడు. అప్పుడు సంవత్సరం తిరిగేసరికల్లా పెద్ద చేతులు బుల్లి మేడంని పెట్టి తీరాదం అని కృష్ణ అంటుంది. ఇక నువ్వు ఈ మాట చెబితే చాలు. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు కృష్ణ అంటూ మురారి గబగబా ఆ గది తలుపులన్నీ వేసేసి రూమ్ లో ఫ్రెషనర్ కొట్టి కృష్ణను మురారి దగ్గరకు తీసుకుంటాడు. ఎసిపి సార్ అంటూ కృష్ణ అరుస్తుంది.
అప్పుడు ఈ గదిలో పూల పరిమళం లేకపోయినా పర్వాలేదు నీ మనసు నాకు దగ్గర అయితే చాలు మన ఇద్దరి మధ్య గాలి కూడా చొరబడడానికి వీల్లేదు అని కృష్ణ నీ మురారి దగ్గరగా తీసుకుంటాడు. మురారి కృష్ణను దగ్గరగా తీసుకొని ముద్దు పెట్టడానికి ట్రై చేస్తాడు. ఇక అప్పుడు కృష్ణ తనని పక్కకి తోసేసి ముహూర్తం పెట్టేంత వరకు వేచి చూడక తప్పదు ఏసిపి సార్.. అప్పటివరకు ఆగాల్సిందే అని కృష్ణ అంటుంది. ఈ ముహూర్తం ఎప్పుడు పెడతారు? ఇదంతా ఎప్పుడు జరుగుతుందో అసలు అది జరుగుతుందో జరగదు అని మురారి కృష్ణతో అంటాడు. అదేం ఉండదు అని కృష్ణ మురారికే సద్ది చెబుతుంది.
ఇద్దరు జంటలు కలిసి ట్రిప్ కి బయలుదేరుతున్నామని ఇంట్లో అందరికీ చెబుతారు. ఇంతకీ ట్రిప్ ఎక్కడికి అని నందు అడగగా అప్పుడు ఇక్కడే రిసార్ట్ కి వెళ్తున్నాము అని ముకుందా చెబుతుంది. కనీసం రూమ్స్ అయినా బుక్ చేసుకున్నారా అని మధు అడగగా.. అక్కడికి వెళ్ళాక చూసుకుంటానని ముకుందా అంటుంది. అవునా అదేంటి ముందుగా ప్లాన్ చేసుకోవచ్చు కదా.. ఒకవేళ అక్కడ రూమ్స్ లేకపోతే ఏం చేస్తారు అని అడగగా ఇంకో రెస్టారెంట్ కి వెళ్దామని ముకుందా క్యాజువల్ గా చెబుతుంది. ముందుగా ప్లాన్ చేసుకొని ఉండొచ్చు కదా అని వాళ్ళు అంటారు. మేము బయటికి వెళ్తున్నాం కదా ఇక మిగతావన్నీ మేము చూసుకుంటాము అని రెండు జంటలు వాళ్ళ ట్రావెలింగ్ బ్యాగులు తీసుకొని ట్రిప్ కి బయటకు బయలుదేరుతారు.
ఫస్ట్ మురారి కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఈసారి బ్యాక్ సీట్లో కూర్చుంటే మా ఇద్దరినీ కృష్ణ ఆట ఆడుకుంటుందని గమనించిన ముకుందా కార్ మధ్యలోనే ఆపించేస్తుంది. ఎప్పుడు మీరేనా ఫ్రెంట్ సీట్ లో కూర్చునేది. మేము కూర్చుంటాము ఈసారి ఆదర్శ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాడు అని ముకుందా అంటుంది. అదేంటి అని మురారి అడగగా.. భర్త డ్రైవింగ్ చేస్తుంటే భార్య తన పక్కనే కూర్చోవాలని చాలామందికి ఆశగా ఉంటుంది. పైగా తను కూర్చుని డ్రైవ్ చేస్తూ ఉంటే తనతో సెల్ఫీ తీసుకోవాలని అర్థం చేసుకోరేంటి అని కృష్ణ అంటుంది. ఈసారి ఆదర్శ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ముకుందా పక్కన కూర్చుని ఉంటుంది. ఇక బ్యాక్ సీట్లో కృష్ణ మురారి కూర్చొని ఉంటాడు. మురారి కృష్ణ చేయని లాక్కొని తనతో మాట్లాడుతూ ఉండగా ముకుంద కుల్లుకుంటు ఉంటుంది. మురారి తనకి తలనొప్పిగా ఉందని మసాజ్ చేయమని కృష్ణ ఒడిలో మురారి పడుకుంటాడు. కృష్ణ మురారి కి మసాజ్ చేస్తూ ఉండగా ఆ సీన్స్ చూసి ముకుందా తట్టుకోలేక పోతుంది .
మురారి కృష్ణ కి క్లోజ్ అవుతుంటే ముకుందా చూసి తట్టుకోలేక పోతుంది. కృష్ణ కార్ ఆపి తలనొప్పి బాగుంది. ఇంకాస్త ఎక్కువ రాయి కృష్ణ ఈ ఒక్క దెబ్బతో తగ్గిపోవాలి అని ముకుందా అంటుంది. మొత్తానికి కృష్ణ రాసిన జండుబాంతో మురారి తలనొప్పి తగ్గిపోయింది. చాలా చిరాగ్గా ఉంది అని అంటారు. ఇద్దరూ కలిసి రిసార్ట్ కి వెళ్తారు ఇంతటితో నేటి ఎపిసోడ్ ముగుస్తుంది.
రేపటి ఎపిసోడ్ లో కృష్ణ మురారి రిసార్ట్ లో చాలా క్లోజ్ గా ఉంటారు. ముకుంద మాత్రం ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ముకుంద ఫోన్లో దేవ్ ముకుందతో తను నీకు చాలా అడ్డం వస్తుంది. నీ లైఫ్ కి తను ఎప్పటికీ అడ్డమే అని దేవ్ అంటాడు. ఈసారి నువ్వు చంపడం లాంటి పిచ్చిపనులు పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు అని ముకుంద చెబుతుండగా ఆదర్శం అక్కడికి వస్తాడు. ఇక ముకుందా ఒక్కసారిగా ఆదర్శ్ వైపు షాకే చూస్తుంది. ముకుంద కి అడ్డంగా కృష్ణ అని అనుకుంటున్నారా లేదంటే ఆదర్శాలి అనుకుంటున్నారా ఒకవేళ కృష్ణ అయితే తనని మురారి కి దూరమయ్యేలా ఎలా చేస్తారు. అదే ఆదర్శ అయితే ముకుందనే ఏదో విధంగా మేనేజ్ చేస్తుందా లేకపోతే మరోసారి వీళ్ళిద్దరి అంతు తేల్చడానికి ఆదర్శంగా దీవి రంగంలోకి దిగుతాడా అనేది చూడాలి.