Ravi Teja: మాస్ అనే పేరుకి పెట్టిన పేరు రవితేజ. మన టాలీవుడ్ లోనే బెస్ట్ మాస్ హీరోగా గుర్తింపు పొందిన రవితేజ ఇటీవలే ఈగల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనతో పాటు నూతన దర్శకులను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ మనసున్న నటుడు అనిపించుకున్నాడు రవితేజ.
ఇక రవితేజ సినిమాలు థియేటర్లో ఆడడం ఒక ఎత్తు అయితే ఓటీటీ ఫ్లాట్ ఫారం లో సందడి చేయడం మరొక ఎత్తు. సాధారణంగా ప్రస్తుత కాలంలో థియేటర్ లో ఆడే సినిమాకి ఎంత రెస్పాన్స్ వస్తుందో చెప్పలేము కానీ ఓటీటీలో మాత్రం భారీ రెస్పాన్స్ దక్కుతుంది. అది కూడా ఓ స్టార్ హీరో సినిమా అయితే అది పక్క సూపర్ హిట్ అని చెప్పొచ్చు. సినిమా కాన్సెప్ట్ ఎలా ఉన్నప్పటికీ ఒక స్టార్ హీరో సినిమా కావడంతో ఆ సినిమాని ఓటీటీలో వీక్షిస్తున్నారు ప్రేక్షకులు.
ఇక తాజాగా విడుదలైన అనేక సినిమాలు ఓటీటీలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక రవితేజ కూడా సందడి చేయనున్నట్లు తెలుస్తుంది. రవితేజ రీసెంట్ మూవీ ఈగల్ కంటే ముందే మరో మూవీతో ఓటీటీలో దర్శనం ఇవ్వనున్నాడు. మరి ఆ సినిమా ఏంటి అని ఆలోచిస్తున్నారా.. ఆ సినిమా మరేదో కాదు టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా వైడ్ గా వచ్చిన ఈ మూవీ నిన్ననే ప్రైమ్ వీడియోలో హిందీ వర్షన్ స్ట్రీమింగ్ కి వచ్చింది.
ఈ గ్యాప్ లోనే ఈ చిత్రం ఇండియా వైడ్ గా టాప్ 5 లోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రైమ్ వీడియోలో టాప్ 4 లో ట్రెండ్ అవుతుంది. దీంతో రవితేజ హిందీ వర్షన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో అనేది మరోసారి నిరూపించుకున్నాడు. ఈ సినిమాకి వంశీ దర్శకత్వం వహించగా అభిషేక్ అగర్వాల్ నిర్మాణం వహించారు. ఇక ఈ మూవీ థియేటర్లో ఊచకోత కోసిందనే చెప్పొచ్చు. థియేటర్ వద్ద పాన్ ఇండియా సినిమాలు ఎన్ని ఉన్నప్పటికీ రవితేజ సినిమా అంటే ఓ స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుంది. మరి ఈగల్ ఓటీటీ లో ఎంతటి దుమారం రేపుతుందో చూడాలి మరి..!