NewsOrbit
న్యూస్ సినిమా

Bheemla nayak: మళ్ళీ అదే సెంటిమెంట్..త్రివిక్రమ్ ఈ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు

Bheemla nayak: త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా సినిమాలు చేసినప్పటి నుంచి కొన్ని పాత్రల విషయంలో సెంటిమెంట్‌ను అలాగే కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఒకసారి తన దర్శకత్వంలో సినిమా చేసిన హీరోయిన్‌తో మళ్ళీ మళ్ళీ సినిమా చేయడం. అలాగే, తను రాసుకున్న పాత్రలకు పూర్తి న్యాయం చేస్తున్న ప్రముఖ నటులను రిపీట్ చేయడం. ముఖ్యంగా కామెడీ కింగ్ బ్రహ్మానందం. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అతడు సినిమాలో అందరికంటే బాగా హైలెట్ అయింది బ్రహ్మానందం పోషించిన పాత్ర. ఈ సినిమా ఎపుడు టీవీలో వచ్చిన కడుపుబ్బా నవ్వుకుంటారు. అలాగే, జల్సా, జులాయి, అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో బ్రహ్మీ పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటాయి.

trivikram sentiment for bheemla nayak
trivikram sentiment for bheemla nayak

త్రివిక్రమ్ సినిమాలో బ్రహ్మీ ఎంట్రీతోనే ప్రేక్షకులు నవ్వులు మొదలుపెడతారు. ఇక డైలాగ్స్ చెబుతూ.. పర్ఫార్మెన్స్ చేస్తుంటే థియేటర్స్ నవ్వులతో దద్దరిల్లిపోతాయి. అలాంటి బ్రహ్మీ గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్నారు. కరోనా వేవ్స్ మొదలైనప్పటి నుంచి దాదాపుగా ఆయన ఇంటికే పరిమితమయ్యారు. మళ్ళీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నారు. ముందు ఈ సినిమాలో బ్రహ్మీ పాత్ర లేదు. మలయాళం వెర్షన్ అయ్యప్పనుమ్ కోషియుమ్ లో కూడా ఈ పాత్ర ఉండదు. కానీ, తెలుగులో బ్రహ్మానందం సినిమా చేస్తానని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక త్రివిక్రమ్ ఓ పాత్రను క్రియేట్ చేశారు.

Bheemla nayak: బ్రహ్మీ ఎలా నవ్విస్తారో.

భీమ్లా నాయక్ సినిమాలో ఆయనది ఫారెస్ట్ ఆఫీసర్ పాత్ర అని సమాచారం. ఈ పాత్రతో మళ్ళీ బ్రహ్మీ తన సత్తా చాటతారని చిత్రయూనిట్ చాలా నమ్మకంగా చెబుతోంది. పవన్ – రానా నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీలో త్రివిక్రమ్ గత చిత్రాలలో హైలెట్ అయినట్టుగానే భీమ్లా నాయక్ సినిమాలోనూ హైలెట్ అవుతుందట. తన సెంటిమెంట్ ప్రకారం ఈ పాత్రను చాలా అద్భుతంగా రాసినట్టు చెబుతున్నారు. చూడాలి మరి కాస్త లాంగ్ గ్యాప్ తర్వాత భీమ్లా నాయక్ సినిమాలో కనిపించబోతున్న బ్రహ్మీ ఎలా నవ్విస్తారో. కాగా, ఈ సినిమాను ఇదే వారం ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. పవన్ – నిత్యా మీనన్, రానా – సంయుక్త మీనన్‌ల జంట బాగా ఆకట్టుకుంటుందని మేకర్స్ అంటున్నారు.

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri