Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. “ఆదిపురుష్” పరాజయం పాలైన తర్వాత దానిపై ప్రేక్షకుల దృష్టికి వెళ్లకుండా కొత్త సినిమాల అప్ డేట్స్ వరుస పెట్టి వదులుతూ ఉన్నాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన “ఆదిపురుష్” ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన సంగతి తెలిసిందే. పైగా బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన అన్ని సినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ఇలాంటి తరుణంలో నెగెటివిటీ మరింతగా పెరిగిపోకుండా చాలా జాగ్రత్తగా.. ప్రేక్షకుల దృష్టిని మరులుస్తూ.. తన కొత్త సినిమాలు సలార్, ప్రాజెక్ట్ K అప్ డేట్స్ ఇస్తూ అభిమానులను అల్లరిస్తూ ఉన్నారు. దీనిలో భాగంగా జులై 19వ తారీఖు బుధవారం “ప్రాజెక్ట్ K”.. లో ప్రభాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది.
అయితే ఈ పోస్టర్ లో ప్రభాస్ అంతగా ఆకట్టుకోలేకపోవడంతో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. సినిమా యూనిట్ అధికారికంగా విడుదల చేసిన ప్రభాస్ లుక్ చూసి ఇది నిజంగా సినిమాలోనిదేనా అని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ప్రభాస్ తలను ఎవరి శరీరానికి అతికించినట్లు ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఏంట్రా బాబు మా అభిమాన హీరో కెరియర్ తో ఎవరు పడితే వాళ్ళు ఆడుకుంటున్నారు అని ఫ్యాన్స్ బోర్ మంటున్నారు. ఈ లుక్కు చూస్తే మరో “ఆదిపురుష్” చేసేటట్టు ఉన్నారు అని మండిపడుతున్నారు. వచ్చే ఏడాది జనవరి నెలలో ఈ సినిమా విడుదల కాబోతోంది.
సూపర్ హీరోస్ తరహాలో స్పైడర్ మాన్.. సూపర్ మాన్ రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ కెరియర్ లో అత్యంత హై బడ్జెట్ సినిమా “ప్రాజెక్ట్ K”. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు అమితాబచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని మరి కొంతమంది నటిస్తున్నారు. హాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హై టెక్నాలజీ కెమెరాలతో షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రభాస్ లుక్ నేడు విడుదల చేయగా.. చూడటానికి మరీ దారుణంగా ఉండటంతో భారీ ఎత్తున ట్రోలింగ్ చేస్తున్నారు.