మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం `సైరా నరసింహారెడ్డి`. బ్రిటీష్ వారిని ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితగాథను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అక్టోబర్ 2న సినిమాను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుంది. సినిమా విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కుటుంబీకులు చిరంజీవి ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. ప్రారంభంలో సినిమా షూటింగ్‌తో పాటు అవసరమైన లొకేషన్, ఉయ్యాలవాడకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తీసుకున్నారని ఆ సమయంలో తమకు న్యాయం చేస్తారని చిరంజీవిగారు హామీ ఇచ్చారని, కానీ హామీని నేరవేర్చలేకపోయారని వారు ఆరోపణలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
previous post
next post
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!