సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరన్ నిర్మించిన చిత్రం `బందోబస్త్`. ఈ సినిమా సెప్టెంబర్ 20న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ “ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు ఇంత భారీగా తారాగణం, ఉన్నత నిర్మాణ విలువలతో రావడానికి కారణమైన లైకా ప్రొడక్షన్స్ అధినేత సుభాస్కరన్గారే కారణం. సెప్టెంబర్ 20న తెలుగులోనూ భారీ ఎత్తున సినిమాను విడుదల చేస్తున్న ఎన్వీ ప్రసాద్ గారికి థాంక్స్. ప్రేక్షకులు ఇచ్చే కిక్, హై డిఫరెంట్. ఈ ‘బందోబస్త్’ కంప్లీట్ ఎంటర్టైనర్ ఫిల్మ్. మీ అందరికీ నచ్చుతుంది. జర్నలిస్ట్ బ్యాగ్రౌండ్ నుండి కెవి ఆనంద్ సార్ వచ్చారు. రియల్, ట్రూ లైఫ్ ఇన్సిడెంట్స్ ఆధారంగా ఆయన సినిమాలు తీస్తారు. ఈ సినిమానూ అలాగే తీశారు. ఇందులో నేను చేసిన పాత్ర నాకు చాలా కొత్త. నాకు కొత్త ఎక్స్ పీరియన్స్. మనకు ఉద్యోగాలు ఉన్నాయి. మనం కష్టపడినందుకు జీతం వస్తుంది. మన దేశం కోసం, భద్రత కోసం ఎంతో మంది నిజమైన హీరోలు, గుర్తింపుకు నోచుకొని హీరోలు సరిహద్దుల్లో ప్రతి రోజు నిలబడతారు. వాళ్లను నేను వ్యక్తిగతంగా కలవడం గొప్ప అనుభవం. దేశానికి ఎంతో సేవ చేసిన వారందరూ వేదికల మీదకు ఎప్పుడూ రారు. గుర్తింపు కోరుకోకుండా తమ తమ బాధ్యతలను నెరవేరుస్తుంటారు. ఆ హీరోలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నమే ఈ ‘బందోబస్త్’. వాళ్లు ఏం చేస్తారో చూపించే ప్రయత్నం చేశాం“ అన్నారు.
previous post
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!