Sai Daram Tej: సినీ పరిశ్రమలో ఎంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. టాలెంట్ ఉంటేనే పైకి వస్తారు. సూపర్ స్టార్.. మెగా స్టార్ ఫ్యామిలీ నుండి వచ్చినా కూడా ఇక్కడ మేటర్ ఉంటేనే నిలదొక్కుకుంటారు. అలాగే ప్రతిభతో పాటు అదృష్టం కూడా కలిసి వచ్చిన వారికి మాత్రమే స్టార్ డమ్ దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అసలు విషయంలోకి వెళితే మెగా ఫ్యామిలీ నుండి వరుసగా హీరోలు టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడం మనకు తెలిసినదే.
Vaishnav tej : రొమాంటిక్ హీరోయిన్‌తో కొత్త సినిమా.. సెట్స్‌పైకి వచ్చిన వైష్ణవ్ తేజ్
Sai Daram Tej: సాయి ధరమ్ తేజ్- పంజా వైష్ణవ్ తేజ్?
ఈ క్రమంలో మెగా కుటుంబం నుండి ఉప్పెన సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ అందరికీ చాలా విభిన్నంగా కనిపించాడు. చాలా డిఫరెంట్ సినిమా కధని ఎంచుకున్నాడంటూ కామెంట్స్ వచ్చాయి. మొదటి సినిమా ఎంపిక నుండి మొదలు పెట్టుకొని అతడి 3వ సినిమా వరకు కూడా వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ వచ్చాడు. ఏ హీరో చేయని సాహసం అతడు మొదటి సినిమాలోనే చేసేందుకు సిద్ధమయ్యాడు. తెలుగులో ఏ కమర్షియల్ హీరో కూడా అలాంటి క్లైమాక్స్ ను ఒప్పుకోడు.
Sai daram tej: రికవర్ అయ్యి ఇంటికి వచ్చాక పెళ్లి కండీషన్ పెట్టిన సాయిధరమ్‌తేజ్ ఫ్యామిలీ..
సాయి ధరమ్ తేజ్ సినిమాల ఎంపిక!
అలాగే వైష్ణవ్ తేజ్ 2వ సినిమా కొండపొలం కూడా విభిన్నమైన సినిమానే. ఇక సాయి ధరమ్ తేజ్ మాత్రం హీరోగా కెరీర్ ఆరంభం నుండే వరుసగా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను చేస్తూ రావడం మనకు తెలిసిందే. కానీ తమ్ముడు వైష్ణవ్ మాత్రం ఆ దారిలో నడవకుండా తన దారి డిఫరెంట్ అని నిరూపించుకుంటూ వైవిధ్యభరిత కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇలాంటి కథలను చేయడం ద్వారా అన్నను మించిన హీరోగా తమ్ముడు వైష్ణవ్ నిలుస్తాడని టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!