Varun Tej: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజా చిత్రం `గని`. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయి మంజ్రేకర్ హీరోయిన్గా.. ఉపేంద్ర కీలక పాత్రను పోషించారు. బాక్సింగ్ నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని రెనసాన్స్ ఫిలింస్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్ల పై సిద్ధు ముద్ద, అల్లు బాబీ కలిసి నిర్మించారు. ఎస్.ఎస్. తమన్ సంగీతం అందించారు.
ఎప్పుడూ ఈ మూవీ షూటింగ్ పూర్తి అయినప్పటికీ.. విడుదలకు మాత్రం మోక్షం కలగడం లేదు. ఈ సినిమాను 2021 జూలై 30న విడుదల చేయాలనుకున్నారు. కానీ, కరోనా కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత దీపావళి కానుకగా సినిమాను ప్రేక్షకులకు ముందుకు తీసుకురావాలని ఏర్పాట్లు చేశారు. అప్పుడూ కుదరలేదు.
డిసెంబర్ 3న విడుదల చేయాలని భావించగా.. సెట్ అవ్వలేదు. ఫిబ్రవరి 25న ఎలాగైనా సినిమాను థియేటర్స్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేశారు. `భీమ్లా నాయక్` చిత్రం అడ్డు పడింది. తాజాగా మేకర్స్ గని కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించాడు. సమ్మర్ కానుకగా ఏప్రిల్ 8వ తేదీన ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు.
ఈ మేరకు ఓ వీడియో ద్వారా మేకర్స్ ప్రకటించారు. మరి ఈ సారైనా వరుణ్ తేజ్ `గని`కి మోక్షం కలుగుతుందా..? లేదా..? అన్నది చూడాలి. కాగా, ఈ సినిమాలో వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా కనిపించనున్నాడు. ఇప్పటికే ఈయనకు సంబంధించిన లుక్స్ బయటకు వచ్చి నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
https://www.instagram.com/tv/CamXcYSqM–/?utm_source=ig_web_copy_link
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!