పెళ్ళిచూపులు, అర్జున్‌రెడ్డి, గీత గోవిందం వంటి సక్సెస్‌లతో క్రేజీ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవకొండ. ఇప్పుడు మంచి హిట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈయన నటించిన డియర్ కామ్రేడ్ పెద్దగా సక్సెస్ కాలేదు. క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విజయ్ దేవరకొండ పూరితో సినిమా చే్యబోతున్నాడు. అలాగే బాలీవుడ్లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడని వార్తలు వినపడుతున్నాయి. ఈ సెప్టెంబర్ 6నే దానికి ముహూర్తం కుదిరిందట. కరణ్‌జోహార్, సాజిద్, సిద్ధార్థ్ రాయ్ నిర్మిస్తోన్న చిత్రం ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడని టాక్. త్వరలోనే మరికొన్ని వివరాలు తెలియనున్నాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!