(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
బహమాస్‌లో డోరియన్ హరికేన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తుపాను ధాటికి జనజీవనం స్తంభించింది. బలమైన ఈదురు గాలులకు ప్రజలు విలవిలలాడుతున్నారు. డోరియన్ ప్రభావంతో ఓ స్టేడియం ఏర్పడింది. మేఘాలు కళ్ల ముందే గోడలాగా కనిపించాయి. చుట్టూ మేఘాలు మధ్య ఓ విమానం. డోరియన్ ఎంత శక్తవంతమైనదో ఈ దృశ్యాలు స్పష్టం చేశాయి. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను నేషనల్ హరికేన్ సెంటర్ అధికారులు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
తుపాను వల్ల ఇప్పటి వరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. విపత్తు వల్ల 13వేల నివాసాలు ధ్వంసమయ్యాయి. అబాకో ద్వీపంలో వరదలకు తాగు నీరు కలుషితమైంది. విపత్తు తీవ్రత అధికంగా ఉండటం వల్ల సహాయక చర్యలు నిలిచిపోయాయి. వరదల వల్ల అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. డోరయిన్ తుపాను నేపథ్యంలో ప్రజలు తమ నివాసాలను విడిచి బయటకు రాకూడదని అధికారులు ఆదేశించారు. తుపాను తీవ్రత తగ్గే వరకు సహాయక చర్యలు చేపట్టలేమని స్పష్టం చేశారు. డోరైన్ ధాటికి 7 మీటర్ల వరకు గాలివాన ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనని బహమాస్ దేశస్థులు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మరోవైపు డోరియన్ తుపాను మంగళవారం అమెరికాలోని ఫ్లోరిడా తీరప్రాంతంవైపు ప్రయాణిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Here's a look at what scientists call the "stadium effect" inside the eye of #Dorian from @NOAA scientists. This happens at times in very strong hurricanes. The latest forecast on Dorian is available at https://t.co/tW4KeFW0gB pic.twitter.com/Knv6w7nXP6
— National Hurricane Center (@NHC_Atlantic) September 1, 2019