NewsOrbit
టాప్ స్టోరీస్ సినిమా

విజయ్ కి ఏమయ్యింది…?

పాపులారిటీ.., సెలెబ్రిటీ ఇమేజ్ రావడం ఎంత కష్టమో… దాన్ని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ఆ హోదా వచ్చాక నడక, నడవడిక, నడత, మాట, తీరు అన్నీ గమనంలో ఉంటాయి. ఏ మాత్రం తేడా జరిగినా తిరోగమనంలోకి వెళ్తాయి. సినీ పరిశ్రమలో ఇటువంటి ఉదాహరణలు కోకొల్లలు. హిట్లు కొట్టి సెలెబ్రెటీగా మారిన తర్వాత ఫ్లాపులతో పరిస్థితి మారిపోతుంది.
ఆరడుగుల హైటు… పక్కింటి కుర్రాడి యాసతో మాటలు… యూత్ ని విపరీతంగా ఆకట్టుకునే స్టైల్, ఆటిట్యూడ్… ఇవన్నీ కలగలిసి హీరోని చేసిన విజయ్ దేవరకొండకి పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం స్టార్ ఇమేజ్ ని తెచ్చిపెట్టాయి. వెనక్కు తిరిగి చూసుకోకుండా సెలేబ్రిటిగా మార్చేశాయి. పాతికేళ్ల నుండి సినీ పరిశ్రమలో ఉన్న హీరోల కంటే మంచి క్రేజ్ వచ్చేసింది. దేశ వ్యాప్తంగా కూడా ఫాలోయర్లు ఉన్నారు. అయితే విజయ్ దశ తిరోగమనంలోకి వెళ్ళలేదు, ఇప్పటికిప్పుడు వచ్చే నష్టమేమి లేదు. కానీ అప్రమత్తమవ్వాల్సిన, ఆచితూచి మాట్లాడాల్సిన సమయం మాత్రం వచ్చింది. సరైన హిట్లు రెండు పడాల్సిన తరుణం వచ్చింది.

అయిదేళ్ల తర్వాత స్టార్ హోదా…!

2011 లో రవిబాబు డైరెక్ట్ చేసిన నువ్విలా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన విజయ్ దేవరకొండ … 2016 లో వచ్చిన పెళ్లి చూపులతో మాత్రమే హీరోగా అందరికీ తెలిసారు. తర్వాత 2017 లో అర్జున్ రెడ్డి, 2018 లో గీత గోవిందం లాంటి హిట్లు ఆయన్ని టాప్ రేంజికి తీసుకెళ్లాయి. రెండేళ్లయింది హిట్ పడి. 2018 లోనే వచ్చిన టాక్సీ వాల పరవాలేదనిపించినా… తర్వాత వరుసగా ఫ్లాపులు చేరాయి. గీత గోవిందం తర్వాత నోటా, డియర్ కామ్రేడ్ చిత్రాలు అంచనాలు అందుకోలేదు. తాజాగా చచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ కూడా విజయ్ ని నిరాశపరిచింది. నాలుగు ప్రేమ కథలతో భిన్నంగా ప్రయత్నించినప్పటికీ ఫెయిల్ అయింది. దీంతో విజయ్ కెరీర్ కి కాస్త ఊపు తగ్గింది. అతని కలెక్షన్ల స్పీడ్ తగ్గడంతో నిర్మాతలు అతనితో సినిమాల బడ్జెట్ విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారట. త్వరలో రానున్న హీరో సినిమా విషయంలో ఇవే మాటలు వినిపిస్తున్నాయి. ముందుగా అనుకున్న బడ్జెట్ కంటే సగమే పెడతానని నిర్మాత అంటుండడంతో ఈ ప్రాజెక్టు డైలమాలో పడినట్టు సినీ వర్గాల సమాచారం. ప్రసుతం ఎటువంటి కథలు ఎంచుకోవాలి అనే సందిగ్ధంలో కూడా విజయ్ ఉన్నారు. ప్రేమ కథలు ఇక చేయబోనని మొన్నీమధ్య వరల్డ్ ఫెమస్ లవర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రకటించినప్పటికీ ఆయనకు ప్రస్తుతానికి కాస్త డైలమా మాత్రం అలముకుంది.

శ్రీనివాస్ మానెం 

Related posts

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu

Swapna kondamma: మూడో కంటికి తెలియకుండా శ్రీమంతం జరుపుకున్న బుల్లితెర నటి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Nindu Noorella Savasam: నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి పల్లవి గౌడ అవుట్.. కన్నీరు మున్నీరు అవుతున్న ఫ్యాన్స్..!

Saranya Koduri

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Youtuber Ravi Shiva Teja: యూట్యూబర్ రవి శివ తేజ కి ఇంత పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందా?.. బయటపడ్డ నిజా నిజాలు.‌!

Saranya Koduri

Hari Teja: సీరియల్ యాక్ట్రెస్ హరి తేజ ఏజ్ ఎంతో తెలుసా?.. చూస్తే ప‌క్కా షాక్.‌.!

Saranya Koduri

Heeramandi Review: హిరామండి సిరీస్ సిద్ధార్థ్ రివ్యూ.. కాబోయే భార్య సిరీస్ హిట్టా? ఫట్టా?

Saranya Koduri

Neethone Dance: కంటెస్టెంట్లది అక్కడేమీ ఉండదు.. జడ్జ్‌లదే తప్పంతా.. బిగ్ బాస్ అఖిల్ సంచలన వ్యాఖ్యలు..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Leave a Comment