Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. దాదాపు 17 ఏళ్ల నుంచీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈ బ్యూటీ.. ఇప్పుడు `ఎఫ్ 3`తో ప్రేక్షకులను పలకరించబోతోంది. `ఎఫ్ 2`కు ఇది సీక్వెల్. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటించారు.
వారికి జోడీగా తమన్నా, మెహ్రీన్ లు నటించగా.. బాలీవుడ్ బ్యూటీ సోనాల్ చౌహాన్, సునీల్ కీలక పాత్రలను పోషించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతికే విడుదల కావాల్సి ఉన్నా.. పలు కారణాల వల్ల వాయిదా పడి చివరాఖరకు మే 27న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ నేపథ్యంలోనే మేకర్స్ జోరుగా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. దర్శకనిర్మాతల, హీరోలు, హీరోయిన్లు వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ, తమన్నా మాత్రం ప్రచార కార్యక్రమాల్లో కనిపించలేదు. ఈ మధ్య కాలంలో ఈమె చేసిన చిత్రాలేమి పెద్దగా విజయం సాధించలేదు. `ఎఫ్ 3` తన కెరీర్‌కు ఎంతో కీలకం అని తెలిసినా తమన్నా ప్రమోషన్స్‌కు దూరంగా ఉంది.
మొన్నటివరకు తమన్నా కేన్స్ లో బిజీగా గడిపింది. అది ఒక కారణం కావచ్చు. కానీ, కేన్స్ ఫిలిం ఫెస్టివల్ ముగిసిన తర్వాత కూడా తమన్నా ఎఫ్3 ప్రమోషన్స్ లో జాయిన్ కాలేదు. దీంతో తమన్నా ఎందుకిలా చేస్తుందో తెలియక ఫ్యాన్స్ అయోమయంలో పడ్డారు. మరోవైపు తమన్నా అలిగిందని, సినిమాలో తన పాత్ర కన్నా సోనాల్ చౌహాన్ రోల్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని, అందుకారణంగానే ఆమె ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని టాక్ నడుస్తోంది.
Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!