యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ తన స్క్రీన్ నేమ్‌ను మార్చుకున్నాడు. ప్రస్తుతం ఈయన హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వరల్డ్ ఫేమస్ లవర్’. ఈ సినిమాకు ఈ హీరో తన స్క్రీన్ నేమ్‌ను దేవరకొండ విజయ్ సాయిగా వేసుకుంటున్నాడు. పెళ్ళిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్రాల తర్వాత విజయ్ నటించిన మరే చిత్రం బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. ఈ నేపథ్యంలోనే న్యూమరాలజీ ప్రకారం విజయ్ తన పేరుని మార్చుకున్నాడని ఇండస్ట్రీలో వార్తలు వినపడుతున్నాయి. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత విజయ్ దేవరకొండ ‘ఫైటర్’ సినిమాలో నటించబోతున్నాడు. దీనికి పూరి జగన్నాథ్ దర్శకుడు. త్వరలోనే సినిమా సెట్స్‌పై కి వెళ్లనుంది. ఇది పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుంది.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!