మెగా ఫ్యామిలీలో నుండి ఎందరో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు, అందరూ సినీ అభిమానుల్లో తమదైన ముద్ర వేసిన వాళ్లే.. అయితే మెగా డాటర్ నిహారిక కొణిదెల మాత్రం మొదటి సినిమాతోనే నిరాశ పరిచింది. ఒక మనసు సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నిహారిక, నటన పరంగా పర్వాలేదని పించినా కూడా సినిమా మరీ డల్ గా ఉండడం, కథలో పెద్దగా మెప్పించే విషయం లేకపోవడంతో ఒక మనసు సినిమా మెగా అభిమానులని నిరాశ పరిచి బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.
ఒక మనసు సినిమా రిజల్ట్ తేడా కొట్టడంతో కొంచెం గ్యాప్ తీసుకున్న నిహారిక, సెకండ్ మూవీ హ్యాపీ వెడ్డింగ్ తో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. హిట్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన యువి క్రియేషన్స్ నిర్మాణంలో హ్యాపీ వెడ్డింగ్ తెరకెక్కడంతో ఈసారి నిహ హిట్ అందుకోవడం ఖాయం అనుకున్నారు. సినిమా విడుదలకి ముంచి బయటకి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ కూడా పాజిటివ్ గానే ఉండడంతో, హ్యాపీ వెడ్డింగ్ తో హిట్ అందుకోవచ్చనే ధీమాతో నిహారిక హ్యాపీగా రిలాక్స్ అయ్యింది కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక సెకండ్ డే నెగటివ్ టాక్ తెచ్చుకొని ఎవరూ ఊహించని రిజల్ట్ ని ఇచ్చింది.
ఇలా తన మొదటి రెండు సినిమాలతో ఫ్లాప్స్ ఫేస్ చేసిన నిహారిక, ఈసారి అయినా హిట్ అందుకోవాలని సూర్యకాంతంగా మారి మరీ రిస్క్ చేస్తోంది. నిహా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సూర్యకాంతం, గతేడాది జూన్ 23న ప్రారంభమైన ఈ సినిమాలో రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. నిహారికాని వెబ్ సిరీస్ కి పరిచయం చేసిన ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలోనే ఈ సినిమా తెరకెక్కుతుండడంతో మెగా అభిమానులు నిహా, ఈసారి హిట్ అందుకుంటుందనే నమ్మకంతో ఉన్నారు. చెల్లి కెరీర్ ని సెట్ చేయడానికి అన్న వరుణ్ తేజ్ సూర్యకాంతంని ప్రెజెంట్ చేస్తుండడం విశేషం. రిపబ్లిక్ డే కానుకగా సూర్యకాంతం సినిమా టీజర్ లో రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే సూర్యకాంతం కంప్లీట్ ఫన్ ఎంటర్టైనర్ గా రాబోతున్నట్లు తెలుస్తోంది, ఇందులో నిహారిక ఎప్పటిలాగే చాలా ఎనర్జిటిక్ గా కనిపించింది కానీ కథలోనే కొత్తదనం లోపిస్తున్నట్లు ఉంది. సింపుల్ గా చెప్పాలి అంటే నిహారిక ఫస్ట్ టైం నటించిన వెబ్ సిరీస్ ముద్దపప్పు ఆవకాయకి సూర్యకాంతం ఎక్స్టెండెడ్ వెర్షన్ లాగే కనిపిస్తోంది. మరి ఈ సినిమాతో అయినా నిహారిక హిట్ అందుకుటుందేమో చూడాలి.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!