Kushi: టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, ప్రముఖ స్టార్ హీరోయిన్ సమంత జంటగా ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్ను కోరి, మజిలీ వంటి లవ్ స్టోరీలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు శివ నిర్వాణ ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇదీ ప్రేమకథా చిత్రమే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం నిర్మితమవుతోంది.
ఈ ప్రాజెక్ట్ కు `ఖుషీ` అనే టైటిల్‌ను ఖరారు చేసిన మేకర్స్.. ఇటీవలె టైటిల్‌తో కూడిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సైతం బయటకు వదిలారు. ఇందులో కశ్మీర్ కుర్రాడిగా విజయ్ దేవరకొండ, తమిళ అమ్మాయిగా సమంత కనిపించబోతున్నారని అంటున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కశ్మీర్‌లోనే జరుగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాలో విజయ్-సమంతల మధ్య ఓ లిప్ లాక్ సీన్ ఉంటుందట. ఇప్పటివరకు మాజీ భర్త అయిన నాగచైతన్యతో మాత్రమే లిప్ లాక్ చేసిన సమంత.. ఇప్పుడు ఖుషీలో విజయ్‌తో అలాంటి సీన్ చేయడానికి ఓకే చెబుతుందా.. లేదా.. అన్నది ఆసక్తికరంగా మారింది.
బాలీవుడ్ హీరోయిన్లు కరీనాకపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యారాయ్ పెళ్లయిన తర్వాత కూడా లిప్ లాక్ సీన్ల లో నటించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఇక ఇప్పుడు సమంత సైతం వారి బాటలోనే నడిచి విజయ్‌తో లిప్ లాక్ సీన్లో నటిస్తే.. తెలుగు సిల్వర్ స్క్రీన్‌పై ఆమె కొత్త ట్రెండ్‌కు తెరలేపినట్లే అవుతుందని అంటున్నారు.
Geetu royal: 5 నెలలుగా నరకం అనుభవిస్తున్న గీతు రాయల్.. కారణం ఇదే..!