NewsOrbit
సినిమా

రాజన్నా నిన్నాప‌గ‌ల‌రా

రాజ‌న్న నిన్నాప‌గ‌ల‌రా అంటూ ” యాత్ర ” ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫిబ్ర‌వ‌రి 8న విడుద‌ల‌
జ‌న‌నేత‌గా తెలుగు వాళ్ల గుండెల్లో ప‌దిల‌మైన చోటు ద‌క్కించుకున్న నాయ‌కుడు, ఉమ్మ‌డి ఆంధ్రప్రదేశ్ ముఖ్య‌మంత్రి డాక్ట‌ర్ వై.య‌స్‌. రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పేద‌ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల్ని నేరుగా విన‌టానికి మెద‌లు పెట్ట‌ని పాద‌యాత్ర‌లో ముఖ్య ఘ‌ట్టాల‌న్ని తీసుకుని యాత్ర  పేరుతో భారీగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.  వై ఎస్ ఆర్ రాజకీయ జీవితంలో పాదయాత్ర కీలక ఘట్టం.. ఆ సమయంలో జరిగిన ముఖ్య సంఘటనల సమాహారమే ఈ యాత్ర. మలయాళ సూప‌ర్‌స్టార్ మమ్ముట్టి వై ఎస్ ఆర్ పాత్రలో జీవిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్ టీజర్ అండ్ డైలాగ్ టీజ‌ర్ల‌తో ఈ విషయం స్పష్టమైంది. మొదటి సింగిల్ సాంగ్ తో యాత్ర స్టోరీ లోని హై ఇంటెన్సిటీ చూపించారు. ఇప్పుడు రాజ‌న్నా నిన్నాప‌గ‌ల‌రా అంటూ సాగే రెండ‌వ సింగిల్ తో ఆయ‌న పాద‌య‌త్ర వ‌ల‌న ప్ర‌జ‌ల ఆనందాన్ని చూపించారు.. ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ద‌ర్శ‌కుడు మ‌హి వి రాఘ‌వ్ ఈ యాత్ర‌ ని తెర‌కెక్కిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న 70 ఎం ఎం ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ అత్యంత భారీ వ్య‌యంతో, ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ  చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. ఆంధ్ర ప్ర‌దేశ్ ఎన్నికులు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో ఫిబ్ర‌వరి 8న యాత్ర‌ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు చేస్తున్నారు. అలానే తెలుగుతో పాటు త‌మిళం, మ‌ళ‌యాలంలో కూడా యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8న రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌మెష‌న్ యాక్టివిటిని యాత్ర సినిమాకి అనుగుణంగా వైవిధ్యంగా చేయ‌టానికి నిర్మాత‌లు ప్ల‌న్ చేస్తున్నారు.
దివంగ‌త నేత డాక్ట‌ర్ వైయ‌స్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి గారు పాద యాత్ర చేశార‌నే విష‌యం మాత్ర‌మే తెలుగు ప్ర‌జ‌ల‌కి తెలుసు కాని ఆ పాద‌యాత్ర త‌న రాజ‌కీయ యాత్ర లో ఎంత కీల‌క‌మే కొంత‌మందికే తెలుసు. అప్ప‌టి రాజ‌కీయ అనిశ్చితి దృష్ట్యా ఆయ‌న ప్ర‌జ‌ల‌కి ద‌గ్గ‌ర‌గా వెళ్ళి వారి స‌మ‌స్య‌లు తెలుసుకొవ‌టానికి ఈ యాత్ర మెద‌లుపెట్టారు.. కాని ఆ యాత్ర‌లో ఎన్ని విష‌యాలు ఆయ‌న ఎంత‌ ద‌గ్గ‌ర‌గా చూశారో,  సాదార‌ణమైన‌ క‌ష్టాలు కూడా తీర్చుకోలేని అతి సామాన్యుల్ని ఎలా క‌లిసారో, పేద‌వారంటే ఎవ‌రొ.. వారు దేనికొసం చూస్తున్నారొ ఆయ‌న ప్ర‌త్య‌క్షంగా చూశారు. ఇలా ఓక ముఖ్య‌మంత్రి అభ్య‌ర్ది మ‌హ‌నాయ‌కుడు నేరుగా వ‌చ్చి వారి స‌మ‌స్య‌ల్ని తెలుసుకోవ‌టాన్ని పేద బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల ప్ర‌జ‌లు త‌మ ఆనందాన్ని పాట రూపంలో మ‌లిచారు.. 
 
కోటలో కోలువయ్యే రేడు పేట దారే పట్టినాడు …పాత రాతలన్నీ మారిపోయే ఆసలెన్నో తెచ్చినాడు
 
పల్లవి: 2
 
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో(2)
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో(2)
 
మండిపోయే బడుగోళ్ళ తలపై గొడుగు నీడై వొచ్చాడయ్యో
మంది కోసమే తానున్న నంటూ మాటిచ్చే మారాజయ్యో.
 
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో
 
Bridge: 
 
మెతుకును ఎరగని బతుకుల మొరవిని నీటి మబ్బులా కరిగాడు
బీటను విచ్చిన బీళ్ళను తడిపిన వాన జల్లులా కురిసాడు
 
చరణం:
 
ఉసూరుమంటూ నిట్టూర్పు సెప్పే ఊసులన్నీ విన్నాడురా
లేనోళ్ళ గడపకి ఐనోడిలాగా ఆసరా తానన్నాడురా
రైతన్న సేనుకి సంక్రాంతి గా
కష్టాల పడవకి సుక్కానిగా
నీ అడుగు పడితే మావైపిలా
రాజన్న నిన్నాపగలరా..            “
 
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో
 
మండిపోయే బడుగోళ్ళ తలపై గొడుగు నీడై వొచ్చాడయ్యో
మంది కోసమే తానున్న నంటూ మాటిచ్చే మారాజయ్యో.
 
ఊళ్ళే.. ఏరల్లె మారీ హోరు హోరున ఉప్పొంగెరో
దార్లే.. తారంగవాడి సేతులెత్తీ జైకొట్టెరో
ఈ సందర్భంగా నిర్మాతలు విజయ్ చిల్లా, శ.శి దేవిరెడ్డి మాట్లాడుతూ… మ‌డ‌మ‌తిప్ప‌ని నాయకుడు శ్రీ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డిగారి పాత్ర‌లో  మమ్ము‌ట్టి గారు న‌టిస్తున్నారు. మ‌మ్ముటి గారు ప్ర‌‌జానాయ‌కుడు వై ఎస్ ఆర్ పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసి న‌టిస్తున్నారని నిస్సందేహంగా ప్ర‌క‌టిస్తున్నాం. ఇప్ప‌టికే విడుద‌ల చేసిన యాత్ర మెద‌టి లుక్ కి, టీజ‌ర్ కి, ఫస్ట్ సింగిల్ కు రెండు రాష్ట్రాల ప్ర‌జ‌ల నుండి అనూహ్య‌మైన స్పంద‌న రావడంతో చాలా సంతోషంగా ఉంది. మా బ్యానర్ నుంచి  భ‌లేమంచిరోజు, ఆనందోబ్ర‌హ్మ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు యాత్ర హ్యాట్రిక్ చితంగా నిలుస్తుందనే  నమ్మకంతో ఉన్నాం. ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ చిత్రంలో ఆద్యంతం ఎమోషన్ తో కూడిన పాత్ర‌లు, పాత్ర చిత్రణ కనిపిస్తుంది. తెలుగు ప్ర‌జ‌లంద‌రూ త‌ప్ప‌కుండా చూడ‌వ‌ల‌సిన చిత్రంగా తెర‌కెక్కిస్తున్నాం. దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి గారి రాజకీయ ప్రయాణంలో ఆయన చేసిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోయింది. ఆయన పోరాట పటిమ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది. అలాంటి రాజకీయ ప్రజ్ఞాశాలి పాదయాత్ర లో జరిగిన వాస్తవిక, భావోద్వేగ సంఘటనలతో ఈ యాత్ర చిత్రాన్ని నిర్మిస్తున్నాం.
ఈ సంద‌ర్బంగా యాత్ర రెండ‌వ సింగిల్ ని లెజెండ‌రి ర‌చ‌యిత శ్రీ సిరివెన్నెల సీతారామ‌శాస్ట్రి గారు ర‌చించారు. కె సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం యెక్క ప్ర‌మెష‌న‌ల్ ఈవెంట్స్ ఒక్కొక్క‌టి మెమె తెలియ‌జేస్తాము.. ప్ర‌తి తెలుగు వాడికి ఈ సినిమా రీచ్ అయ్యేలా ప్ర‌మెష‌న్ ని ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల భాష‌ల్లో ఏక‌కాలంలో యాత్ర చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రి 8 న విడుద‌ల చేస్తున్నాము.. అని అన్నారు

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Leave a Comment