NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Judge : అతనికోసం ఏకంగా జిల్లా జడ్జినే బెదిరిస్తున్న పోలీసులు..! కాంగ్రెస్ లీడర్ మర్డర్ కేసులో మలుపులు

Judge :  మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ నాయకుడైన దేవేంద్ర చౌరాసియా మర్డర్ కేసు ను పరిశీలిస్తున్న డిస్ట్రిక్త్ అడిషనల్ జడ్జి చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారం రేపాయి. మధ్యప్రదేశ్ లోని హట్టా డిస్టిక్ అడిషనల్ జడ్జ్ అయిన ఆర్.పి సొంకర్ తన పై దామోహ్ డిస్ట్రిక్ పోలీస్ సూపరిండెంట్ నుండి విపరీతమైన ఒత్తిడి ఉన్నట్లు తెలిపారు.

 

MP Judge fears of SP
MP Judge fears of SP

అంతేకాకుండా ఈ కేసులో తీర్పు ఏమాత్రం అటూ ఇటూ గా వచ్చినా తన ప్రాణాలకే ముప్పు ఉంది అన్నట్లు సొంకర్ ప్రస్తావించడం గమనార్హం. వివరాల్లోకి వెళితే… మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ నాయకుడైన దేవేంద్ర చౌరాసియా హత్యకేసులో బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే రామ్ భాయ్ ఠాకూర్ భర్త అయినటువంటి గోవింద్ సింగ్ ప్రధాన నిందితుడిగా పరిగణింపబడ్డాడు. అయితే జడ్జి సొంకర్ మాట్లాడుతూ పోలీస్ సూపరిండెంట్ నిందితుడితో కలిసి తనను బెదిరిస్తున్నట్లు చెప్పారు. అంతే కాకుండా ఎస్పీ తన సబ్ ఆర్డినేట్స్ కలిపి తనపై లేనిపోని కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడడని సొంకర్ చెప్పడం గమనార్హం.

దీంతో జడ్జి ఈ కేసు హియరింగ్ ను కూడా బదిలీ చేయమని కోరారు. దేవేంద్ర మర్డర్ కేసులో బీఎస్పీ ఎమ్మెల్యే భర్తతో పాటు ఆమె దగ్గర బంధువులు కూడా కేసులో నిందితులుగా ఉన్నారు. అయితే పోలీస్ స్టేట్మెంట్ చూసినప్పుడు మాత్రం పోలీసులు అనుమానితుడు లేదా నిందితుడికి అరెస్టు వారెంట్ ఇచ్చే విషయంలో వారు నియమాలు అతిక్రమించిన్నట్లు ఏకంగా జడ్జి ప్రస్తావించడం గమనార్హం.

అంతేకాకుండా నిందితుడైన గోవింద్ సింగ్ ను హాజరుపరిచే క్రమంలో కూడా పోలీసులు అతనికి సహకరిస్తున్నారని అసలు అరెస్టు వారెంటు కు సంబంధించిన ఏ ఒక్క నియమం కూడా వారు పాటించటం లేదని చెప్పారు. ఈ విషయమై తాను కోర్టులో నిలదీస్తే తనకే బెదిరింపులు వస్తున్నాయని భవిష్యత్తులో తనకు ఏదైనా జరగవచ్చు అని విచారం వ్యక్తం చేశారు. ఇక ఈ విషయాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని పోలీసు ఉన్నతాధికారులను విచారణ కు ఆదేశించాలని ఆయన కోరారు.

author avatar
arun kanna

Related posts

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju