NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

టీడీపీ అధినేత చంద్రబాబుకు వైసీపీ రెబల్ ఎంపి రఘురామ షాకింగ్ ప్రతిపాదన

దేశ రాజధాని ఢిల్లీలో ఏపి రాజకీయాలకు సంబంధించి ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అద్యక్షతన జరిగే అఖిలపక్ష సమావేశంలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్న నేపథ్యంలో ఆయనతో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు భేటీ అయ్యారు. చంద్రబాబుతో రఘురామ సమావేశం కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే చంద్రబాబు వద్ద రఘురామ కృష్ణంరాజు ఓ షాకింగ్ ప్రతిపాదన చేయడం సంచలనం అయ్యింది. చంద్రబాబుతో సమావేశం అయిన తర్వాత రఘురామ మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం తాను రాజీనామా చేయడానికి సిద్దంగా ఉన్నాననీ తెలియజేసిన రఘురామ, టీడీపీ ఎంపీలను రాజీనామా కోసం ఒప్పించేందుకు చంద్రబాబుతో భేటీ అయినట్లు తెలిపారు.

MP Raghurama Meets Chandrababu

 

ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని బీజేపీ పెద్దలు తరచు చెబుతూనే ఉన్నారు. చంద్రబాబే హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించారని వైసీపీ గతం నుండి విమర్శిస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు ప్రత్యేక హోదా ఉద్యమాన్నే ఎత్తుకుని టీడీపీ కేంద్రంలోని బీజేపీ నుండి దూరం అయ్యింది. కేంద్రంలోని బీజేపీతో చంద్రబాబు దోస్తీ కటీఫ్ చేసుకున్న తర్వాత రాష్ట్రంలో టీడీపీకి ఊహించని నష్టం జరిగింది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ బీజేపీకి దగ్గర కావాలనే చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారనేది బహిరంగ రహస్యం. ఈ తరుణంలో కేంద్రంతో పేచీ పెట్టుకునేందుకు చంద్రబాబు సిద్దం గా లేరు. అందుకే రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో కేంద్రంలోని బీజేపీ పెద్దలు అడగకపోయినా ఎన్డీఏ అభ్యర్ధులకు టీడీపీ మద్దతు ఇచ్చింది.

ఏదో విధంగా బీజేపీ పెద్దలను మరో సారి ప్రసన్నం చేసుకోవాలని చంద్రబాబు తాపత్రయపడుతున్న తరుణంలో ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని రఘురామ ప్రతిపాదన తీసుకురావడం నోట్లో వెలక్కాయ పడినట్లు అయ్యిందని అంటున్నారు. తన ప్రతిపాదనపై చంద్రబాబు ఏమన్నారు అనేది మాత్రం రఘురామ తెలియజేయలేదు. ఇతర రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నా ఏపికి సంబంధించి అధికార, విపక్షాలు కేంద్రంలోని ఎన్టీఏకి అనధికార మిత్రపక్షాలే అన్నది జగమెరిగిన సత్యం. అందుకే ఎంపి రఘురామ ప్రతిపాదనపై టీడీపీ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం లేదు.

Related posts

YSRCP: వైసీపీ కౌంటింగ్ ఏజెంట్ లకు ‘సజ్జల’ కీలక సూచనలు

sharma somaraju

NTR-Kalyan Ram: ఎన్టీఆర్ – క‌ళ్యాణ్ రామ్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సూప‌ర్ హిట్ మూవీ ఏదో తెలుసా?

kavya N

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజ‌న్ 8కి రంగం సిద్ధం.. ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్ లో టాలీవుడ్ క్రేజీ హీరో!?

kavya N

Dhanush: 40 ఏళ్ల వ‌య‌సులో రెండో పెళ్లికి రెడీ అవుతున్న ధ‌నుష్‌.. అమ్మాయి ఎవ‌రంటే..?

kavya N

Janhvi Kapoor: శిఖర్ పహారియాతో ప్రేమాయ‌ణం.. మ‌రో వారంలో పెళ్లి.. వైర‌ల్ గా మారిన జాన్వీ కామెంట్స్‌!

kavya N

Mokshagna Teja: మోక్షజ్ఞ ఫిల్మ్ ఎంట్రీపై బాల‌య్య క్రేజీ అప్డేట్‌.. ఫుల్ ఖుషీలో నంద‌మూరి ఫ్యాన్స్‌!!

kavya N

Varalaxmi Sarathkumar: ఫిక్సైన వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ వెడ్డింగ్ డేట్.. ఇంత‌కీ పెళ్లి జ‌ర‌గ‌బోయేది ఎక్క‌డంటే..?

kavya N

Chandrababu: విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబు..ఎయిర్ పోర్టు వద్ద ఘన స్వాగతం

sharma somaraju

YSRCP: ఆ నిబంధనలు ఈసీ ఉపసంహరించుకోవాలి: వైసీపీ

sharma somaraju

Chiranjeevi: చిరంజీవి ప‌క్క‌న‌ హీరోయిన్‌గా, చెల్లెలుగా న‌టించిన ముగ్గురు హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Praja Bhavan: ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు

sharma somaraju

Fahadh Faasil: పుష్ప విల‌న్ కు అరుదైన వ్యాధి.. ఇక దానికి చికిత్సే లేదా..?

kavya N

Varsham: ప్ర‌భాస్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ వ‌ర్షం సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

Namitha: పెళ్లైన ఏడేళ్ల‌కే భ‌ర్త‌తో న‌మిత విడాకులు.. ఓపెన్ అయిపోయిన‌ హీరోయిన్‌!

kavya N

Ravi Teja: ఓటీటీలో స‌రికొత్త రికార్డు సృష్టించిన ర‌వితేజ ఫ్లాప్ మూవీ.. ఇండియా హిస్ట‌రీలోనే తొలిసారి ఇలా..!!

kavya N