NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

Telangana: తెలంగాణలో ఎన్నికలే ఎన్నికలు !ఈ నెలలోనే పురపోరు!!

Telangana: తెలంగాణలో వరుసబెట్టి ఎన్నికలు జరుగుతున్నాయి.మొన్న దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, నిన్న గ్రేటర్ హైదరాబాద్ కార్పోరేషన్ ఎన్నికలు జరిగిపోగా రేపు నాగార్జుసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నిక జరగనున్నది.దీంతో ప్రధాన రాజకీయ పక్షాలన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి.ఈ నేపథ్యంలోనే తెలంగాణలో మరో ఎన్నికల నగరా మోగింది. రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం నోటిఫికేషన్‌ను జారీ చేసింది.

muncipal elections in telangana this month
muncipal elections in telangana this month

Telangana: ఎక్కడెక్కడ ఎన్నికలు?

తెలంగాణలో ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు, సిద్దిపేట, జడ్చర్ల, అచ్చంపెట్, నకిరేకల్, కొత్తూరు మున్సిపల్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16 నుంచి 18 వరకు నామినేషన్లు స్వీకరించనుననారు. 19న అభ్యర్థుల నామినేషన్ల పరిశీలన, 22 వరకు నామినేషన్లఉప సంహరణ చేపట్టనున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది. మే 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.రేపటి నంచే నామినేషన్ల స్వీకరణ చేపట్టనుండటంతో.. ఆయా ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లను పకడ్బంధీగా నిర్వహించాలని అధికారులకు ఎన్నికల సంఘం ఆదేశించింది.

ఖాళీ అయిన వార్డులకు కూడా!

దీంతోపాటు… వివిధ కారణాలతో ఖాళీ అయిన డివిజన్లకు కూడా ఈనెల 30న పోలింగ్‌ నిర్వహించనున్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని లింగోజిగూడ డివిజన్‌కు, గజ్వేల్‌, నల్గొండ, జల్‌పల్లి, అలంపూర్‌, బోధన్‌, పరకాల, మెట్‌పల్లి, బెల్లంపల్లిలో ఒక్కో వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

రిజర్వేషన్లు ఖరారు: ఏర్పాట్లు పూర్తి

సిద్దిపేట పాలకమండలి పదవీకాలం ఈ రోజుతో ముగియనుంది. జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడ్డాయి. దీంతో రెండు కార్పొరేషన్లు, ఐదు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు ఇప్పటికే ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ రోజు ఉదయం వార్డుల వారీ రిజర్వేషన్లను రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటించి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు.మున్సిపల్ ఎన్నికల్లో కూడా మళ్ళీ తెలంగాణాలో హోరాహోరీ పోరు జరగడం ఖాయంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

author avatar
Yandamuri

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju