Ram : రామ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. అంతక ముందు వరుసగా ఫ్లాపుల్లో ఉన్న రామ్..ఈ సినిమాతో తిరుగులేని కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నాడు. అంతేకాదు మాస్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఇక ఈ ఎనర్జిటిక్ హీరో తన మార్కెట్ ని భారీగా పెంచుకునే ప్రయత్నంలో ఉన్నాడు. ఇందులో భాగంగానే తమిళ హిట్ సినిమా తడం తెలుగు రీమేక్ ‘రెడ్’ లో నటించాడు. డ్యూయల్ రోల్ లో నటించిన ఈ సినిమా సంక్రాంతి బరిలో దిగి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది.
అయినా మరోసారి మాస్ ఎంటర్టైన్ మెంట్ లో నటించేందుకు తమిళ్ డైరెక్టర్ లింగుస్వామితో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇది కూడా మల్టీ లాంగ్వేజెస్ లో రూపొందిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో తెరకెక్కుతున్న ఇందులో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్గా నటిస్తోంది. రాక్ స్టార్ దేవిశ్రిప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. రామ్ కెరీర్ లో ఈ సినిమా 19గా తెరకెక్కుతోంది. ఈ క్రమంలో తన 20వ సినిమాను మురగదాస్ దర్శకత్వంలో నటించేందుకు చర్చలు జరుగుతున్నాయని తాజా సమాచారం.
Ram : రామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది.
ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వరుసగా తమిళ దర్శకులకి రామ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. రీసెంట్గా రామ్ తో మురగదాస్ ఓ యాక్షన్ కథ చెప్పినట్టు సమాచారం. రామ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే మరొక క్రేజీ కాంబినేషన్ సినిమా రావడం పక్కా. ఇక ఈ సినిమాను తెలుగు తమిళ భాషల్లో రూపొందిస్తారట.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!