Nandamuri Family: తెలుగు సినీ ఇండస్ట్రీలోని నటులంతా కలిసి ఏర్పరుచుకున్న సంఘమే “మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్”.. సెప్టెంబర్ లో జరగనున్న “మా” ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి.. ఇప్పటికే మా అధ్యక్ష పదవి కోసం ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే.. తాజాగా మా ఎన్నికల బరిలోకి నందమూరి హీరో ఈ పోటీలో దిగుతున్నారని ఫిలింనగర్లో ఈ న్యూస్ చక్కెర్లు కొడుతోంది..!!
నందమూరి తారక రామారావు తెలుగు సినీ ఇండస్ట్రీ ఆద్యుడుగా అందరూ కొలుస్తారు. నందమూరి కుటుంబానికి కి టాలీవుడ్ లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఇప్పుడు మా అధ్యక్ష బరిలో నందమూరి కుటుంబం నుంచి తారక రామారావు మనవడు, హరికృష్ణ కొడుకు, కళ్యాణ్ రామ్ ఈ పోటీలో పాల్గొంటున్నట్లు తాజా సమాచారం.. కళ్యాణ్ రామ్ అటు హీరోగా ఇటు నిర్మాతగా మంచి సినిమాలను చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ కోరిక మేరకు అధ్యక్ష పోటీలో దిగుతున్నారని అని ఫిలిం నగర్ లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది ఈ న్యూస్. ప్రతిసారీ జరిగే మా ఎన్నికల్లో పోటీకి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ కోసం పోటీదారులు అంతా ప్రయత్నిస్తుంటారు. ఈసారి ఈ కుటుంబం మద్దతు మంచు విష్ణు కు అని టాక్ వినిపిస్తోంది. ఇప్పుడు కళ్యాణ్ రామ్ మా ఎన్నికల్లో పాల్గొంటున్నారన్న ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!