NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Nara Lokesh: ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన నారా లోకేష్

Share

Nara Lokesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసి జైల్ కు తరలించడంతో లోకేష్ తన యువగళం పాదయాత్రను అర్దాంతరంగా నిలుపుదల చేసి న్యాయ నిపుణులతో సంప్రదించేందుకు, చంద్రబాబు అరెస్టు విషయాన్ని జాతీయ నేతలకు వివరించి మద్దతు కూడగట్టేందుకు ఢిల్లీకి వెళ్లారు.

వచ్చే వారం నుండి లోకేష్ పాదయాత్ర పునః ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన తరుణంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ పేరును ఏ 14 గా చేరుస్తూ సీఐడీ ఏసీబీ కోర్టులో మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ ను కూడా ఏదో ఒక కేసులో అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో ఇవేళ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నిందితులుగా చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణ పేర్లు ఉండగా, తాజాగా లోకేష్ పేరును సీఐడీ పేర్కొంది. దీంతో ఈ కేసులో అరెస్టు నుండి ఉపశమనం పొందేందుకు లోకేష్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.

ఇప్పటికే స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో ఉన్న చంద్రబాబును ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఫైబర్ నెట్ కేసులోనూ అరెస్టు చూపేందుకు సీఐడీ .. ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్ పిటిషన్ దాఖలు చేసింది. చంద్రబాబు జైల్ నుండి బయటి రావడం ఆలస్యం అవుతుండటంతో నారా లోకేష్ తిరిగి పాదయాత్రను కొనసాగించడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయనే పార్టీ నేతలకు తెలియజేశారు. యువగళం పాదయాత్ర ఆగిన చోటి నుండే ఈ నెల 29న మళ్లీ మొదలు పెట్టేందుకు సిద్దమవుతున్నారు. అయితే చంద్రబాబు కేసుకు సంబంధించి  సుప్రీం కోర్టులో దాఖలు చేసి క్వాష్ పిటిషన్ పై విచారణ అక్టోబర్ 3వ తేదీకి వాయిదా పడిన నేపథ్యంలో పాదయాత్రను లోకేష్ పునః ప్రారంభిస్తారా లేదా అనేది వేచి చూడాలి.

Chandrababu Arrest: చంద్రబాబు కేసులు .. ఏపీ హైకోర్టు, ఏసీబీ కోర్టులోనూ వాయిదా


Share

Related posts

Immanuel : వర్షను వదిలేసి మరో అమ్మాయి వెనుక తిరుగుతున్న ఇమ్మాన్యుయేల్ కు భలే బుద్ధి చెప్పారు?

Varun G

కొత్త జిల్లాల ఏర్పాటు తో రాజకీయం గా చావుదెబ్బ కొట్టబోతున్న జగన్ ? 

sekhar

Cine Actor Ali: రాజ్యసభకు పంపిస్తారా..? కొన్ని కండీషన్లు ఉన్నాయి..!

Srinivas Manem