Naresh Pavitra: నరేష్ – పవిత్ర లోకేష్… ఇపుడు టాలీవుడ్లో వీరి జంట ఓ సంచలనం. సీనియర్ నటుడు నరేష్ తాను పెళ్లిచేసుకున్న రెండవ భార్యకు విడాకులు ఇవ్వకుండానే నటి పవిత్ర లోకేష్ వెంట తిరుగుతున్నాడని దాదాపు రెండు నెలల క్రితం మీడియాలో వార్తలు వచ్చిన సంగతి విదితమే. అదంతా ఒకెత్తయితే ఇటీవల సూపర్ స్టార్ కృష్ణకు పలువురు సెలబ్రిటీలు నివాళులు అర్పించేందుకు వచ్చిన సమయంలో కూడా పవిత్ర లోకేష్ – నరేష్ గురించి టాపిక్ నడిచింది. దానికి వారి ప్రవర్తనే కారణం.
Naresh Pavitra: నరేష్, పవిత్ర సినిమా
ఇక అసలు విషయానికొస్తే, గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న ఈ జంట త్వరలో హీరో, హీరోయిన్గా ఓ సినిమాలో నటించబోతున్నట్లు టాలీవుడ్లో వార్తలు గుప్పుమన్నాయి. ఇక ఈ మూవీలో నరేష్, పవిత్ర లోకేష్ వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాల్ని చూపించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిని బయోపిక్ అనాలా లేక రియల్ పిక్ అనాలో అర్ధం కావడం లేదని ఓ వర్గం సోషల్ మీడియాలో వాదిస్తోంది. పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్లో వీళ్లిద్దరూ ఎదుర్కొన్న సవాళ్లతో ఇప్పటికే కథని సిద్ధం చేసినట్లు సమాచారం.
సూపర్ హైప్
నరేష్, పవిత్ర లోకేష్ చాలా సినిమాల్లో భార్యాభర్తలుగా కనిపించిన సంగతి తెలిసినదే. అయితే వీరు తొలిసారి హీరో, హీరోయిన్గా నటిస్తుండటంతో ఈ మూవీకి సోషల్ మీడియాలో బాగా హైప్ వస్తోంది. సదరు సినిమాలో తాము ఎందుకు సహజీవనం చేయాల్సి వచ్చిందన్న అంశాలపై క్లారిటీ ఇవ్వనున్నారట. అంటే ఆ సంబంధిత కథతో వీరు ముందుకొస్తున్నారు. కాగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన, నటీనటులు, టెక్నికల్ క్రూ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!