Cybercrime: సైబర్ కేటుగాళ్లు కూడా అప్డేట్ అయ్యారు!! కొత్త పద్ధతి..జాగ్రత్త!!

Cybercrime: సైబర్ కేటుగాళ్లు కూడా అప్డేట్ అయ్యారు!! కొత్త పద్ధతి..జాగ్రత్త!!
Share

Cybercrime: టెక్నాలజీ అప్డేట్ అవ్వడం వలన మన పనులు తేలిక అవుతున్నాయి. ఏ పని అయినా క్షణాలలో అయిపోతుంది. అలాగే సైబర్ కేటుగాళ్లు Cybercrime కూడా అప్స్డేట్ అయ్యారు. అవును… ఇంతక ముందు వరకు మీ ఓటీపీ లేదా ఏటీఎం పిన్ ఉంటేనే వారికీ పని అయ్యేది. కానీ తాజాగా వెలుగులోకి వచ్చిన సంఘటన చూస్తుంటే వారు కూడా అప్డేట్ అయ్యినట్లు తెలుస్తుంది. ఒక్క ఫోన్ కాల్ తో ఓ వ్యక్తి అకౌంట్ లోని డబ్బు మొత్తం మాయం అయిపోయింది. ఇది తెలుసుకున్న అతను ఎన్ని విధాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

New way of Cybercrime
New way of Cybercrime

ముజీబ్ అనే గుంటూరు వాసి వృత్తి రీత్యా సివిల్ ఇంజనీర్. ఆన్ లైన్ మోసాలు, బ్యాంకు ఫ్రాడ్ ల గురించి అతడికి అవగాహన ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య అతనికి ఓ అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ రాగా లిఫ్ట్ చేశాడు. జైపూర్ లోని ఒక ప్రముఖ బ్యాంకు పేరు చెప్పి మీ అకౌంట్ లో నుంచి ఈ మధ్య ఏమైనా ఇరవై వేల రూపాయలు డ్రా చేసారా అని అడగా అతడు లేదు అని సమాధానం ఇచ్చాడు. అది విన్న ఫోన్ లోను వ్యక్తి మీ అకౌంట్ నుంచి ఎవరో డ్రా చేసారు మీ కార్డు ని బ్లాక్ చేస్తున్నాం అని ఫోన్ పెట్టేసాడు.

వెంటనే ముజీబ్ కి అనుమానం వచ్చి ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చెయ్యగా అకౌంట్ ఖాళీ. వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేసాడు అలాగే బ్యాంకు ని సంప్రదించాడు. పోలీసులకి సైతం ఫిర్యాదు చేసాడు కానీ ఎవ్వరు ఏమి చెప్పలేకపోతున్నారు. దీనితో అతను చేసేదేమి లేక తీవ్రంగా వాపోతున్నాడు.


Share

Related posts

Pension For Trees: ప్రాణ వాయు దేవత పింఛన్ పథకం గురించి తెలుసా..!? ప్రతి సంవత్సరం ఎంత ఇస్తారంటే..

bharani jella

కరోనా కి భయపడకుండా సినీ తారలంతా అక్కడికే ఎందుకు వెళుతున్నారు ..?

GRK

Twitter: ట్రంప్ కి భారీ షాక్ ఇచ్చిన ట్విట్టర్… ఎవ్వరికైనా ఇదే పరిస్థితట!!

Naina