18.7 C
Hyderabad
February 3, 2023
NewsOrbit
Featured ట్రెండింగ్ న్యూస్

Niranthara Ranga Utsava: నేటి నుంచి థియేటర్ ఫెస్టివల్ ప్రారంభం. ఒక్కో రోజు ఒక్కో నాటక ప్రదర్శన!

Niranthara Ranga Utsava
Share

నిరంతర ఫౌండేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఉత్సవం ‘నిరంతర రంగ ఉత్సవ్’. ఈ నెల 25 నుంచి ప్రారంభమై 29 వరకు జరుగుతుంది. మైసురూలోని కళామందిర్ ఆవరణలోని చిన్న థియేటర్‌లో నాటక ప్రదర్శన జరుగుతుంది. సాయంత్ర 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు ఒక నాటకాన్ని ప్రదర్శిస్తారు. ఈ నాటక ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తి కొటిగానహళ్లి రామయ్య, కన్నడ సాంస్కృతిక శాఖ సంయుక్త సంచాలకులు వీఎన్.మల్లికార్జునస్వామి, ప్రసాద్ కందూరు ముఖ్యఅతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే జనవరి 26న ప్రజావాణి మైసూర్ బ్యూరో ఎడిటర్ కే.నరసింహమూర్తి, జనవరి 27న విద్యావేత్త దివాకర్, 28న సీనియర్ థియేటర్ వర్కర్ ఇందిరా నాయర్, డాక్టర్ డీబీ.నటేష్, బెంగళూరుకు చెందిన గ్రీన్ ఫౌండేషన్‌కు చెందిన హొంగల్లి గంగాధర్ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. చివరి రోజు ముగింపు కార్యక్రమంలో బీబీఎంపీ ప్రత్యేక కమిషనర్, కవి ఆరిఫ్ రాజ్, మంత్రి కార్యదర్శి జయరామ్ రాయ్‌పూర్, కన్నడ సాంస్కృతిక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సుదర్శన్, సుస్థాన్ ఇనిస్టిట్యూడ్ మెంబర్ శ్రీనివాస్ పాలహెళ్లి హాజరు కానున్నారు.

Niranthara Ranga Utsava
Niranthara Ranga Utsava

థియేటర్‌లో ప్రదర్శించబడే నాటకాల వివరాలు

జనవరి 25

నాటకం: శాంతకవి విశ్రాంతి

జట్టు: గొంబెమనే, ధార్వాడ్

నిర్మాణం & దర్శకత్వం: ప్రకాష్ గరుడ

నాటకం గురించి: కన్నడ తొలి నాటకకర్త సక్కరి బాలాచార్య ‘శాంతకవి’ జీవితం, విజయాలపై జరిగే ప్రదర్శన ఇంది. శాంతకవి అలియాస్ సక్కరి బాలాచార్య జీవితగాధను చూపించే డాక్యుమెంటరీ డ్రామా. శాంతకవి కన్నడ స్థితిని కనుగొనడం చేసే ప్రయత్నం. ఎదుర్కొన్న సంఘటనలు, తదితరల అంశాలపై ఈ నాటకాన్ని ప్రదర్శిస్తారు.

Niranthara Ranga Utsava
Niranthara Ranga Utsava

జనవరి 26

నాటకం: వరసుదర

దర్శకత్వం: జయరామ్ రాయ్‌పూర్

జట్టు: కాన్స్టాంట్, మైసూర్

నిర్మాణం: ప్రసాద్ కుందూరు

నాటకం గురించి: భారత చరిత్రలో మరిచిపోలేని అధ్యాయం ‘మొఘల్ సామ్రాజ్య చరిత్ర’. మొఘల్ చక్రవర్తి అక్బర్ మతపరమైన రాజకీయ పరమైన ఆదర్శాలు. షాజహాన్, పెద్ద కొడుకు దారాషికో మరణం. తైమూర్ రాజవంశం మొక్క రాజకీయ విషాద చరిత్ర, మొఘల్ సామ్రాజ్య సింహాసనంపై కూర్చొవడానికి జరిగిన రాజకీయ కుతంత్రాలు, తదితరల అంశాలపై ‘వరసుదర’ నాటకాన్ని ప్రదర్శించనున్నారు.

Niranthara Ranga Utsava
Niranthara Ranga Utsava

జనవరి 27

నాటకం: నెమలి పురాణం

నిర్మాణం: ప్రొఫెసర్ కేఈ.రాధాకృష్ణ

జట్టు: సురేష్ అనగల్లి అండ్ టీమ్

నాటకం గురించి: ఉర్దూ రచయిత ఇంతిజార్ హుస్సేన్ కథ స్ఫూర్తితో ‘నెమలి పురాణం’ను కన్నడలో రాశారు ప్రొఫెసర్ రాధాకృష్ణ. ఈ స్టేజ్ షోను దేశంలోని గొప్ప రంగ తపస్వి అయిన సురేష్ అనగల్లి దర్శకత్వం వహించనున్నారు. వినాశకరమైన యుద్ధం ఫలితం నిరాశ్రయులైన నెమలి జీవితం గురించి తెలిపే కథ ఇది. ఈ కథ చుట్టు పురాణాలు, చరిత్ర, వర్తమాన కాలానికి చెందిన అనేక సంఘటనలు పునరావృతం అవుతాయి.

Niranthara Ranga Utsava
Niranthara Ranga Utsava

జనవరి 28

నాటకం: మిస్ సదరమే

సృష్టికర్త: బెల్లావే నరహరి శాస్త్రి

జట్టు: బెంగళూరు

నిర్మాణం: మంజునాథ్ ఎల్ బడిగెర

నాటకం గురించి: మిస్ సదారామే నాటకం బెల్లావే నరహరి శాస్త్రి రచించిన ‘సదారామ’ నాటకంలోనిది. సదారమే జీవిత గాథ, ఆమె ఎదుర్కొన్న సమస్యలు, జీవితంలో మళ్లీ అందుకున్న విజయాలపై ఈ నాటకం కొనసాగుతుంది.

 

Niranthara Ranga Utsava
Niranthara Ranga Utsava

జనవరి 29

నాటకం: దక్లకథ దేవికావ్య

జట్టు: జంగమ కలెక్టివ్

నిర్మాణం & దర్శకత్వం: లక్ష్మణ కేపీ

నాటకం గురించి: ‘దక్లా కథా దేవి కావ్య’ అనేది ప్రముఖ కన్నడ రచయిత, కర్ణాటక ‘దళిత సంఘర్ష్ సమితి’ వ్యవస్థాపక సభ్యుడు కె.బి.సిద్ధయ్య కవిత్వం, కథలను మిళితం చేసిన రంగస్థల నాటకం. ఆదివాసీ వర్గాల ఊహల్లో వికసించిన నేల తల్లి జీవం పుట్టుక కథతో ప్రారంభమయ్యేది ఈ నాటకం.


Share

Related posts

Jabardasth : ఆన్ స్క్రీన్ మీద హిట్ అవుతున్న మరో జంట.. హైపర్ ఆది, బిగ్ బాస్ రోహిణి కెమిస్ట్రీ అదుర్స్?

Varun G

Kambhampati Hari Babu: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్ లు..! కంభంపాటికి వరించిన గవర్నర్ గిరి..!!

somaraju sharma

ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ తీపి కబురు..ఏమిటంటే..?

somaraju sharma