NewsOrbit
న్యూస్ హెల్త్

Hair care: నూనెను ఎంపిక చేసుకోవడం మంచిది. జుట్టును చూసి మీ ఆరోగ్యం చెప్పేయవచ్చు??

Hair care: నూనెను ఎంపిక చేసుకోవడం మంచిది. జుట్టును చూసి మీ ఆరోగ్యం చెప్పేయవచ్చు??

Hair care :జుట్టు Hair care మెరుపుతో ఉందంటే దానిఅర్ధం ఆరోగ్యంగా ఉన్నారని.అదేజీవం లేకుండా ఎండిపోయినట్టు ఉంటే ఎదో ఆరోగ్య సమస్యన్నట్టే. ఇలా జుట్టును బట్టి ఆరోగ్యం చెప్పేయవచ్చు.ఈ మద్య  కాలంలో అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. ఈ సమస్య చాల మందికి ఉంది. దీనికి  కారణం పోషకాల లోపం, ఇతర ఆరోగ్య సమస్యలు ఒక కారణమైతే, జుట్టు కు నూనె పట్టించే విధానం కూడా మరో కారణం గా చెప్పవచ్చు.కురులను కండిషనింగ్‌ చేయడంలో నూనె చాల ముఖ్యమైనది గా చెప్పాలి. రాత్రిపూట నూనె తో మసాజ్ చేసుకుని మరుసటి రోజున తలస్నానం చేయడం వలన వెంట్రుకలు ఆరోగ్యం గా మెరుస్తూ ఉండటంతో పాటు పొడవు కూడా పెరుగుతాయి. కాక పొతే నూనె రాసుకునే విషయం  లో కొంత జాగ్రత్త అవసరం.

oiling-is-the-best-way-for-your-hair-care
oiling-is-the-best-way-for-your-hair-care

వెంట్రుకలు చాలా సున్నితమైన వి. వాటిని  అదేపనిగా  రుద్దడం వల్ల తొందరగా తెగిపోయి, రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల నూనె రాసేటప్పుడు వెంట్రుకలను తల పై చర్మాన్ని వేళ్ళ  చివర్ల సహాయం తో నెమ్మదిగా వలయాకారం లో నిమిరుతున్నట్టుగా మసాజ్ చేసుకోవాలి. ఇలా నూనెతో మస్సాజ్ చేసుకోవడం  వల్ల రక్త  ప్రసరణ జరిగి వెంట్రుకలు  బాగా పెరుగుతాయి.

తల స్నానం చేసిన తర్వాత వెంట్రుకలకు ఉన్న  తడి ఆరకముందే నూనె రాయడం లాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే  వెంట్రుకల మొదళ్లు చాలా సున్నితంగా ఉంటాయి. తడిగా ఉన్నప్పుడు కొంచెం ఒత్తిడి తగిలిన కూడా ఊడిపోతుంటాయి. అందుకే పూర్తిగా తడి ఆరిన తరువాత మాత్రమే నూనెపెట్టుకోవాలి .

నూనె రాయడమంటే చాలామంది జుట్టు కుదుళ్లకే పట్టించి చివరలను అలానే వదిలేస్తారు. జుట్టు కొసలకు  సరైన పోషణ లేకపోతే అవి చిట్లిపోయే ప్రమాదం ఉంది. దాని వలన  వెంట్రుకల పెరుగుదల దెబ్బతింటుంది. జుట్టుఊడిపోవడానికి ఇది కూడా ఒక  కారణమవుతుంది. కాబట్టి  జుట్టు మొదళ్ల తో పాటు, చివర్లకు కూడా నూనెరాసుకోవాలి .

కొబ్బరి నూనె జుట్టుకు మంచి పోషణ ఇస్తుంది. బాదం నూనె తో  వెంట్రుకల పెరుగుదల బాగుంటుంది. ఇక మిగతా నూనెలు  ఏమైనా వాడాలనుకున్నపుడు డాక్టర్‌ సలహా మీదట మీ జుట్టుకి సరిపోయే  నూనెను ఎంపిక  చేసుకోవడం మంచిది.

 

 

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!