NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

సీమ తోపుగాడు అన్నారు .. గొప్ప నాయకుడికి వారసుడు అన్నారు .. ఇప్పుడేమైందో చూడండి ! 

పరిటాల శ్రీరామ్…మాజీమంత్రి పరిటాల సునీత తనయుడు, రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ నాయ‌కుడు. ఇంతే కాదు. రాయ‌ల‌సీమ‌లో బ‌ల‌మైన ప‌రిటాల కుటుంబ స‌భ్యుడు.

అనంత‌పురం అంటే ప‌రిటాల కుటుంబం అనే అంత‌టి గుర్తింపు పొందిన పార్టీ వార‌సుడు. అలాంటి నాయ‌కుడు ఇప్పుడు జాడ‌, ప‌త్తా లేకుండా పోయార‌నే టాక్ తెర‌మీద‌కు వ‌స్తోంది. దీనికి కార‌ణం ఓ పోలీస్ కేసు అని అంటున్నారు.

అప్పుడు మొద‌లైంది అస‌లు ట్విస్ట్‌

గ‌తంలో పోలీసులు, మీడియాలో వ‌చ్చిన వార్త‌ల ప్ర‌కారం, 2018 ఫిబ్రవరి 7న రాప్తాడు వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అనంతరం స్వగ్రామంలో ఉన్న సూర్యం అనే వ్య‌క్తిని పరిటాల శ్రీరామ్‌ తన అనుచరులతో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో కిడ్నాప్‌ చేసి నాలుగు రోజుల పాటు విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు సూర్యంతోనే తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కిడ్నాప్‌ చేసి దాడిచేసినట్లు అప్పట్లో రామగిరిలో వారు కేసు నమోదు చేశారు. అనంతరం నసనకోట సూర్యం అనంతపురం వెళ్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్‌పై ఫిర్యాదు చేయగా.. అప్పట్లో పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేశారు. కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా, బాధితుడు పలుమార్లు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా, పోలీసులు కేసును పునర్ విచారణ చేపట్టారు.

ప‌రిటాల శ్రీరామ్ ప‌త్తా లేర‌ట‌

త‌న‌పై కేసు విచార‌ణ నేప‌థ్యంలో ప‌రిటాల శ్రీ‌రామ్ ప‌త్తా లేర‌నే టాక్ రాప్తాడు నియోజ‌క‌వ‌ర్గంలో వినిపిస్తోంది. సొంత నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌కుండా అయితే హైదరాబాద్‌లో లేదంటే బెంగ‌ళూరులో ప‌రిటాల కుటుంబ వార‌సుడు మ‌కాం వేస్తున్నాడ‌ని టాక్‌. కేసు ద‌ర్యాప్తు విష‌యంలో త‌న‌కు ఇబ్బంది ఎదుర‌వుతుంద‌నే ఇలా చేస్తున్నార‌ని పార్టీ వ‌ర్గాలు అనుకుంటున్నాయి. క‌నీసం కార్య‌క‌ర్త‌ల‌కు సైతం అందుబాటులో ఉండ‌ట్లేద‌ని టాక్‌.

ఇప్పుడేం జ‌రిగిందంటే….

తాజాగా ఈ విచార‌ణ విష‌యంలో ప‌రిటాల శ్రీ‌రామ్‌తో పాటుగా టీడీపీ నాయకులు ముందస్తు బెయిల్‌ తీసుకొని గ‌త‌ శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ప్రతి మంగళ, శుక్రవారం నిందితులు పోలీస్ స్టేషన్ కు వచ్చి సంతకాలు చేయాలని రామగిరి పోలీసులు నిబంధన విధించారు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N