Konda polam:మెగా ఫ్యామిలీ నుంచి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ తన మొదటి సినిమా ‘ఉప్పెన’తో సూపర్ హిట్ అందుకున్నాడు. దాని తర్వాత క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం సినిమాపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. విలేజ్ నేపథ్యంలో కొనసాగే ఈ సినిమా కొండకోనల్లో చిత్రాన్ని చిత్రీకరించిన డైరెక్టర్ క్రిష్.. తన మ్యాజిక్‌తో ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లాడు. కొండకోనల్లో హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఒదిగిపోయింది. హీరో వైష్ణవ్, హీరోయిన్ రకుల్ మధ్య జరిగే సన్నివేశాలు అందరినీ ఆకట్టుకుంటాయి.
<img src="https://newsorbit.com/wp-content/uploads/2021/10/WhatsApp-Image-2021-10-04-at-2.27.10-PM-e1633686030972.jpeg" alt="" width="800" height="533" class="alignnone size-full wp-image-216806" /
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కి ఇండస్ట్రీ నుండి ఊహించని షాక్..!!
కీరవాణి మ్యూజిక్ ప్లస్
ఎంఎం కీరవాణి అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు ప్లస్ అయిందనే చెప్పాలి. సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందుకు సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన నవలను మెయిన్ కాన్సెప్ట్ తీసుకుని చిత్రాన్ని తెరకెక్కించాడు డైరెక్టర్ క్రిష్. ఈ చిత్రంతో క్రిష్ మరో సారి తనలోని ప్రతిభను బయపెట్టాడు. సినిమా చూస్తున్నంత సేపు ప్రకృతి వాతావరణంలో తేలిపోతున్నట్టు అనిపిస్తున్నది. కోట శ్రీనివాసరావు, నాజర్, సాయిచంద్, అన్నపూర్ణ, హేమ, ఆంథోని, రవిప్రకాశ్, మహేశ్ విట్టాతో పాటు మరికొందరు నటులు ఈ సినిమాలో నటించారు.
Kondapolam Review: ‘కొండపొలం’ మూవీ రివ్యూ
మెగాస్టార్ కాంప్లిమెంట్స్
ఈ సినిమాను చూసిన మెగాస్టార్ చిరు ఇప్పటికే మూవీపై కామెంట్స్ చేశారు. భావోద్వేగాల నేపథ్యంలో ‘కొండపొలం’ తెరకెక్కి అన్ని వర్గాల సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నదని కొనియాడారు. పలువురు నెటిజన్స్ సైతం సోషల్ మీడియాల్లో పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. వైష్ణవ్ తేజ్ నటన బాగుందని మంచి మార్కులు ఇస్తున్నారు. ఈ దెబ్బతో వైష్ణవ్ ఖాతాలో వరసగా రెండో హిట్ చేరిందనే చెప్పాలి. అక్కడక్కడ కాస్త కథ నెమ్మదించినా.. హీరో, హీరోయిన్ పాత్రలు, వారి నటన ప్రేక్షకులను మెప్పిస్తుంది. ప్రకృతి ప్రేమికులను సినిమాలోని లొకేషన్స్ కట్టిపడేస్తాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక వైష్ణవ్ నెక్ట్స్ ఎలాంటి సినిమా చేసి ప్రేక్షకులను మెప్పిస్తాడోననే ఆసక్తి నెలకొంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!