Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరస ఫ్లాపుల్లో ఉన్న సమయంలో గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ హరీష్ శంకర్. స్వతహాగా హరీష్ .. పవన్ వీరాభిమాని కావటంతో.. సినిమా రికార్డు సృష్టించడంతో.. హరీష్ శంకర్ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోయింది. అంతకుముందే రవితేజ తో హరీష్ చేసిన మిరపకాయ సినిమా.. పవన్ చేయాల్సి ఉండగా ఆ ప్రాజెక్ట్ నుండి పవన్ తప్పుకోవడంతో తర్వాత.. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కి మంచి హిట్ ఇచ్చాడు.
ఇలా ఉంటే మరో సారి పవన్ తో ప్రస్తుతం హరీష్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే రౌడీ విజయ్ దేవరకొండ తో కూడా హరీష్ సినిమా చేయడానికి రెడీ అయినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ “లైగర్” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత సుకుమార్ తో సినిమా చేయాల్సి ఉండగా అది టైం పట్టే అవకాశం ఉండటంతో.. ఈలోపు హరీష్ తో.. సినిమా చేయటానికి విజయ్ దేవరకొండ రెడీ అయినట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తుంది.
వాస్తవానికి సుకుమార్ “పుష్ప” సినిమా అయిన వెంటనే విజయ్ దేవరకొండ తో సినిమా చేయాల్సి ఉండగా పుష్ప రెండు భాగాలుగా తెరకెక్కిస్తూ ఉండటంతో..ఇంకా టైం పట్టే అవకాశం ఉండటంతో ఈ లోపు.. విజయ్ దేవరకొండ హరీష్ శంకర్ సినిమా స్టార్ట్ చేసి తక్కువ టైమ్ లోనే కంప్లీట్ చేయడానికి.. ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!