Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ రంగం నుంచి సినిమా రంగంలోకి రీ-ఎంట్రీ ఇచ్చిన తర్వాత వరుసపెట్టి సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలలో ఓడిపోయిన తర్వాత మళ్ళీ పవన్ సినిమాల్లోకి రారు.. అని అందరూ అనుకున్న టైంలో .. ఊహించనివిధంగా ప్రేక్షకులను అభిమానులను అలరించే రీతిలో ఐ యాం బ్యాక్ అన్న తరహాలో .. పవన్ వరుసపెట్టి సినిమాలను లైన్లో పెడుతున్నారు. ఇటువంటి తరుణంలో ఆల్రెడీ “భీమ్ల నాయక్” సినిమా చేస్తూనే.. మరోపక్క డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” సినిమా కూడా స్టార్ట్ చేయడం జరిగింది.
ఇదిలాఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోయే సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం .. హీరోయిన్ ప్రియమణి నీ.. తీసుకోవటం జరిగినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీలో వినపడుతోంది. ఇటీవలే ప్రియమణి వెంకటేష్ నటించిన నారప్ప సినిమాలో కీలక పాత్ర చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో పవన్ సినిమాలో ఆమెకు ఛాన్స్ వచ్చినట్లు వార్తలు రావడంతో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గతంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ నటించిన “గబ్బర్ సింగ్” సినిమా సూపర్ డూపర్ హిట్ కావడంతో.. తాజాగా వస్తున్న ఈ సినిమాపై పవన్ అభిమానులు అంచనాలు భారీగా పెట్టుకున్నారు.
ఇటీవలే సెప్టెంబర్ రెండో తారీకు ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ అయిన పోస్టర్ అందరికీ బాగా నచ్చింది. మళ్లీ ఫుల్లీ లోడింగ్.. జాతర షురూ.. అంటూ ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాక.. అంటూ భారీ ట్యాగ్ లైన్ లు.. పోస్టర్లో పెట్టడంతోపాటు పవన్ స్టైలిష్ బైక్ పై కూర్చోవడంతో.. ఎటువంటి కాన్సెప్టుతో ఈ సినిమా హరీష్ తీస్తాడో అన్నది సస్పెన్స్ గా ఉంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!