NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వంగా గీత వీక్‌నెస్‌పై ప‌వ‌న్ పాలిటిక్స్‌.. భారీ ఎఫెక్ట్‌…!

రాజ‌కీయాల్లో త‌ల త‌న్నేవాడు ఒక‌డుంటే.. తాడిత‌న్నేవాడు మ‌రొక‌డు ఉంటాడు. వ్యూహానికి ప్ర‌తివ్యూహం సిద్ధంగానే ఉంటుంది. ఇప్పుడు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఇదే ప్ర‌తి వ్యూహాన్ని ప్లే చేస్తున్నారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌. పిఠాపురం నుంచి ఆయ‌న పోటీకి రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో గెలుపు గుర్రం ఎక్కేందుకు స‌హ‌జంగా అంద‌రూ ఆలోచంచి న‌ట్టుగానే ఆయ‌న కూడా ఆల‌చిం చారు. కానీ, దీనికి కొంత భిన్న‌త్వాన్ని జోడించారు.

వైసీపీ నుంచి పిఠాపురంలో పోటీ చేస్తున్న ఎంపీ వంగా గీత‌ను ప‌రోక్షంగా టార్గెట్ చేసేందుకు ప‌వ‌న్ రెడీ అయ్యారు. ప‌వ‌న్ టార్గెట్‌కు ముందు.. ప్ర‌స్తుతం వంగా గీత చేసిన టార్గెట్ తెలుసుకుంటే.. ఆమె ప‌వ‌న్‌కు యాంటీగా ప్ర‌చారం చేస్తున్నారు. ఆయ‌న లోక‌ల్ కాద‌ని.. నాన్‌లోక‌ల్ అని.. ఇక్క‌డ గెలిచినా ఉండ‌ర‌ని ఆమె ప్ర‌చారంలో ఎక్కువ‌గా చెబుతున్నారు. ముఖ్యంగా సోష‌ల్ మీడియాలో గీత ఈ దిశ‌గానే ప్ర‌చారం చేస్తున్నారు. ఇది నిజ‌మే. దీంతో ప‌వ‌న్ యాంటీ టార్గెట్‌ను తెర‌మీదికి తెచ్చారు.

వంగా గీత చేస్తున్న నాన్‌లోక‌ల్ కామెంట్ల‌ను ఆయ‌న ప‌క్క‌న పెట్టి.. గీత‌పై ప్ర‌ధాన‌మైన ముద్ర ప‌డేలా.. కొ న్ని వ్యాఖ్య‌లు చేశారు. ఆమెకు రాజ‌కీయంగా నిల‌క‌డ‌లేద‌ని.. ఒక పార్టీలో గెలిచి.. రేపు మ‌రో పార్టీ మారిపో యే నాయ‌కురాల‌ని ప‌వ‌న్ ప్ర‌చారంలోకి తెచ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు. ఇదే విష‌యాన్ని తాజాగా జ‌న‌సేన పిఠాపురం నాయ‌కుల‌తో నిర్వ‌హించిన స‌మావేశంలోనూ ప‌వ‌న్ ప్ర‌ధానంగా చెప్పారు. ఈ విష‌యాన్ని విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని అన్నారు.

అంటే.. వంగా గీత త‌న‌పై చేస్తున్న నాన్ లోక‌ల్ ప్ర‌చారానికి దీటుగా.. ఆమెకు నిల‌క‌డ‌లేద‌ని.. ఇప్పుడు మీరు న‌మ్మి.. ఆమెను వైసీపీ త‌ర‌ఫున గెలిపించినా.. రేపు ఆమె మా పార్టీలోకి వ‌చ్చినా ఆశ్చ‌ర్యంలేదనే విధంగా ప‌వ‌న్ చెబుతున్నారు. ఇది కూడా వాస్త‌వ‌మే. గ‌తంలో ప్ర‌జారాజ్యంలో ప‌నిచేసిన గీత .. త‌ర్వాత వైసీపీకి మారారు. రేపు వైసీపీ అధికారంలోకి రాక‌పోతే. మ‌రోసారి పార్టీ మారినా ఆశ్చ‌ర్యంలేదు. ఇదే వీక్‌నెస్‌ను ప‌వ‌న్ త‌న‌కు అనుకూలంగా మార్చుకున్నారు. ఇలాంటి పార్టీలు మారే వారే.. అత్యంత ప్ర‌మాద‌మ‌నేది ఆయ‌న వ్యూహం. దీనినే పిఠాపురంలో పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసేందుకు ప‌వ‌న్ సంసిద్ధంగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N