NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ సినిమా

Pokiri: ఇండస్ట్రీ రికార్డులను వేటాడిన ‘పోకిరి’కి 15 ఏళ్లు

pokiri completes 15 years

Pokiri: పోకిరి Pokiri ఇండస్ట్రీలో గేమ్ చేంజర్ లాంటి హిట్స్ అప్పుడప్పుడూ వస్తూంటాయి. హీరో ఇమేజ్, దర్శకుడి క్రేజ్ ను ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్తాయి. ఇండస్ట్రీలో సరికొత్త బాటకు పునాది వేస్తాయి. అటువంటి సినిమాలకు టాలీవుడ్ లో కొదవ లేదు. అలా వచ్చిన సినిమాల్లో సరికొత్త రికార్డులతో ఇండస్ట్రీ గేమ్ చేంజర్ గా మారిన సినిమా ‘పోకిరి’. మహేశ్-పూరి.. ఇద్దరి కెరీర్లు పోకిరికి ముందు ఆ తర్వాత అనేంతగా మారిపోయాయి. సినిమా సృష్టించిన రికార్డులకు ఇండస్ట్రీ షేక్ అయిపోయింది. పూరి మార్క్ మేకింగ్.. మహేశ్ స్టైలిష్ యాక్టింగ్ సినిమాను సరికొత్త రికార్డులతో ఇండస్ట్రీ హిట్ గా మార్చేసింది. 2006 ఏప్రిల్ 28న విడుదలైన ఈ సినిమా నేటితో 15 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

pokiri completes 15 years
pokiri completes 15 years

కధను స్పష్టంగా, డైలాగులను సూటిగా చెప్పడంలో పూరి స్పెషలిస్ట్. ఈ సినిమా ద్వారా కొత్త మహేశ్ ను పరిచయం చేశాడు. మహేశ్ ను స్టైలిష్, యాక్షన్ మోడ్ లో, మాసివ్ లుక్ లో కొత్తగా చూపించాడు. సరికొత్త హెయిర్ స్టయిల్ తో మహేశ్ లుక్, ఇలియానా అందం.. ఇద్దరి కెమిస్ట్రీ సినిమాకు మంచి ఫ్లేవర్ అద్దింది. ‘ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోద్దో ఆడే పండుగాడు’ అనే డైలాగ్ సినిమాలో డైనమైట్ లా పేలింది. ‘సినిమాలు చూడట్లేదేంటి..’ అంటూ గన్ తిప్పుతూ చెప్పే స్టయిల్ కు ప్రేక్షకులను ఫిదా చేసేశాయి. పూరి స్క్రీన్ ప్లే, టేకింగ్ సినిమాకు మేజర్ ఎస్సెట్. ప్రీ క్లైమాక్స్ లో సస్పెన్స్ రివీల్ చేసినప్పుడు ప్రేక్షకుల్లో పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోతారు.

మహేశ్ లోని మాస్ యాంగిల్, పూరి సరికొత్త టేకింగ్ సినిమాను ఇండస్ట్రీ హిట్ అయ్యేలా చేసాయి. బ్రహ్మానందం-ఆలీ-వేనుమాధవ్ కామెడీ ట్రాక్, మణిశర్మ సంగీతం సినిమాకు ప్లస్ అయ్యాయి. అన్ని భాషల్లో కలిపి 200 కోట్లు బిజినెస్ చేసిందీ సినిమా. 200 సెంటర్లలో 100, 63 సెంటర్లలో 175, షిఫ్టులతో 200 రన్ అయింది. కర్నూలులో షిఫ్టులతో 500 రోజులు రన్ అయి.. పూరి-మహేశ్ కెరీర్లో మెమరబుల్ హిట్ గా నిలిచింది. మహేశ్ సోదరి ఇందిర, వైష్ణో అకాడమీ పై పూరి సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు.

author avatar
Muraliak

Related posts

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu