NewsOrbit
న్యూస్

479బూత్‌లలో రాత్రి వరకూ పోలింగ్

అమరావతి, ఏప్రిల్ 12: ఎన్నికల విధులు నిర్వహించే పోలింగ్ ఆఫీసర్‌లు (పిఒలు), అసిస్టెంట్ పోలింగ్ అధికారుల (ఎపిఒలు)కు ఇవిఎంల నిర్వహణపై పూర్తి స్థాయి అవగాహన కల్పించకపోవడం, ముందుగా తనిఖీలు నిర్వహించకపోవడం తదితర కారణాల వల్ల అటు పోలింగ్ సిబ్బంది, ఇటు ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 479 పోలింగ్ బూత్‌లలో రాత్రి పది గంటల తరువాత కూడా పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 4583 చోట్ల ఇవిఎంలు మోరాయించాయి. 618 కేంద్రాల్లో రెండు గంటల ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం అయ్యింది. పెద్ద ఎత్తున ఇవిఎంలు మోరాయించినా రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేది మాత్రం 318 ఇవిఎంలు మాత్రమే పని చేయడం లేదని చెప్పారు. ఆలస్యంగా ప్రారంభమయిన పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించడం గానీ సమయం పెంచడం గానీ చేయాలని టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినా వారు స్పందించలేదు. ఆరు గంటలలోపు క్యూలైన్‌లో ఉన్న అందరికీ రాత్రి ఏ సమయం అయినా ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు తీసుకుంటామని సిఇఒ ద్వివేది ప్రకటించారు. మునుపెన్నడూ లేని విధంగా అర్థరాత్రి దాటిన తరువాత కూడా పోలింగ్ కొనసాగించారు.

పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలం గుడ్డిగూడెం, విశాఖపట్నం 227 పోలింగ్ బూత్, మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి క్రీస్టియన్‌పేట, విజయనగరం జిల్లా సాలూరు, చిత్తూరు, అనంతపురం, ప్రకాశం జిల్లా కనిగిరి,శ్రీకాకుళం జిల్లా, నెల్లూరు, పశ్చిమ గోదావరి, కర్నూలు, విజయవాడ తూర్పు తదితర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో అర్థరాత్రి వరకూ పోలింగ్ కొనసాగింది.

బ్యాలెట్ ఉపయోగించ రోజుల్లో కూడా ఇంత సుదీర్ఘంగా పోలింగ్ జరిగిన దాఖలాలు లేవని ఓటర్లు చెబుతున్నారు.

256 కేంద్రాల్లో రాత్రి 10గంటల వరకూ, 139 కేంద్రాల్లో 10.30గంటల వరకూ, 70 కేంద్రాల్లో 11గంటల వరకూ, 14 కేంద్రాల్లో రాత్రి 12.30గంటల వరకూ పోలింగ్ నిర్వహించారు.

సాయంత్రం ఆరు గంటల వరకూ 71.43 శాతం వరకు పోలింగ్ నమోదు కాగా మెత్తం ఇవిఎంలలో పోలింగ్ పూర్తి అయిన తరువాత 76.69 శాతం నమోదు అయ్యింది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

Leave a Comment