NTR – Prashanth Neel: ఒక హీరో మీద దర్శకుడు ప్రత్యేకంగా అభిమానం చూపిస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో సినిమాలు చేస్తున్న దర్శకులను చూస్తే అర్థమవుతుంది. మెగాస్టార్‌తో సినిమా చేయాలంటే ఆయనకు ముందు పెద్ద అభిమాని అయి ఉండాలి. దాదాపు ఇప్పటి జనరేషన్ దర్శకులందరూ చిరుకు వీరాభిమానులే. అందుకే, ఆయనను తమ సినిమాలలో స్పెషల్ మేకోవర్‌తో చూపించాలని అభిమానులనే కాక, ప్రతీ ఒక్కరినీ వందకు వంద శాతం అందరూ సంతృప్తి చెందే సినిమాలనే తీస్తున్నారు.
ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఎంతటి ప్రత్యేకమైన అభిమానమో అందరికీ తెలిసిందే. బహుషా ఎన్టీఆర్ హీరోగా రాజమౌళి దర్శకుడిగా మారుతూ తెరకెక్కించిన మొదటి సినిమా స్టూడెంట్ నెం 1 దీనికి కారణం కావచ్చు. మొదటి సినిమా నుంచే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించే ప్రతీ సినిమా కోసం ఎంతో శ్రద్ద తీసుకుంటుంటారు. ఈ విషయం చాలా మంది ఒప్పుకుంటారు. రాజమౌళి మాత్రమే కాదు ఇంకా చాలామందికి ఎన్టీఆర్ అంటే ఎంతో అభిమానం ఉంది.
NTR – Prashanth Neel: ఆ సినిమా కొత్త హిస్ట్రీ క్రియేట్ చేయడం గ్యారెంటీ..
ఆ లిస్ట్‌లో ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా చేరారు. గత 15 – 20 ఏళ్ళ నుంచే ఆయనకు ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టమట. అంతేకాదు, అప్పటి నుంచే నేను ఎన్టీఆర్ కి విపరీతమైన అభిమానిని అని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు మేము ఇద్దరం మంచి స్నేహితులం అయ్యామని తనపై ఉన్న ఈ ప్రత్యేకమైన అభిమానంతో అద్భుతమైన యాక్షన్ ఎంటర్టైనర్ కథ రెడీ చేసినట్టు..అది ఎన్టీఆర్ కి ఎంతో నచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాదు, ఎన్టీఆర్ ఈ సినిమా షూటింగ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్టు తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ప్రశాం నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే ఆ సినిమా కొత్త హిస్ట్రీ క్రియేట్ చేయడం గ్యారెంటీ అనుకోవచ్చు.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!