Priyanka Jawalkar: హీరోయిన్ అన్నాక గ్లామర్ రోల్స్ తప్పని సరిగా చేయాల్సిందే. ఇక్కడ మడి కట్టుకుంటే చూసే జనాలు బాగా తగ్గిపోయారు. అందుకే ముంబై హీరోయిన్స్ నుంచి మన తెలుగమ్మాయిల వరకు గ్లామర్ రోల్స్, ఎక్స్‌ఫోజింగ్ రోల్స్ చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదు. ఏమాత్రం హద్దులు పెట్టుకున్నా కెరీర్ ముందుకు సాగడం కష్టంగా మారింది. సాయి పల్లవి, కీర్తి సురేశ్, నిత్యా మీనన్ లాంటి హీరోయిన్స్ ఎప్పటి నుంచో ఉన్నారు. దానికి తోడు వారు మంచి హిట్స్ అందుకొని క్రేజీ హీరోయిన్స్‌గా మారారు. కాబట్టి వాళ్ళ నుంచి గ్లామర్ రోల్స్ కావాలనుకోవడం కష్టం.
కానీ పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న పూజా హెగ్డే, రష్మిక మందన్న లాంటి వాళ్ళ నుంచి తెలుగమ్మాయిలైన రీతూ వర్మ, ఈషా రెబ్బ లాంటి హీరోయిన్స్ వరకు గ్లామర్ రోల్స్ చేయడానికి సిద్దమవుతున్నారు. లేదంటే పక్క రాష్ట్రం నుంచి వచ్చిన హీరోయిన్స్ ఇక్కడ జెండా పాతేస్తున్నారు. అందుకే మన తెలుగమ్మాయిలు కూడా కథ డిమాండ్ చేస్తే పాత్రకి అవసరమైతే అందాల ఆరబోతకి అడ్డు చెప్పడం లేదు. అలా అడ్డు చెబుతారనే సందేహం ఏమాత్రం మేకర్స్‌కి అనిపించినా వెంటనే వేరే ఛాయిస్ వెతుక్కుంటున్నారు.
Priyanka Jawalkar: వీలైనంత గ్లామర్‌గా కనిపిస్తూ మేకర్స్‌ను ఆకట్టుకొని అవకాశాలు అందుకునే ప్రయత్నాలు చేస్తోంది.
అందుకే ట్రెండ్ ఫాలో అవుతోంది మన తెలుగమ్మాయి ప్రియాంక జవాల్కర్. టాక్సీవాలా సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన ఈ యంగ్ బ్యూటీ మళ్ళీ సినిమా అవకాశాలు అందుకోవడానికి చాలానే సమయం పట్టింది. దాదాపు అందరూ ఈమెని మర్చిపోయారనే చెప్పాలి. అలాంటి సమయంలో ఎస్ఆర్ కళ్యాణ మండపం సినిమాతో వచ్చి హిట్ అందుకుంది. ఇందులో ప్రియాంక జవాల్కర్‌కి మంచి పేరు దక్కింది. దాంతో ఇక వెనక్కి తగ్గేదేలే అన్నట్టుగ్గా లేటెస్ట్ ఫొటో షూట్స్‌తో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది. వీలైనంత గ్లామర్‌గా కనిపిస్తూ మేకర్స్‌ను ఆకట్టుకొని మరిన్ని అవకాశాలు అందుకునే ప్రయత్నాలు చేస్తోంది.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!