Raghava Lawrence : టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నటించిన ముఠామేస్త్రీ సినిమాలో గ్రూప్ డాన్సర్స్ లో ఎక్కడో నాలుగో వరుసలో ఉన్న రాఘవ లారెన్స్ చిరంజీవిని తన స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. దాంతో ఏకంగా చిరంజీవి నటించిన హిట్లర్ సినిమాకి కొరియోగ్రాఫర్ గా అవాకాశం ఇచ్చారు. ఇందులో రాఘవ లారెన్స్ డాన్స్ కంపోజ్ చేసిన సాంగ్స్ కి చాలా మంచి పేరొచ్చింది. దాంతో టాలీవుడ్, కోలీవుడ్ లో కొరియోగ్రాఫర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. హీరోల బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు మాస్ స్టెప్పులు కంపోజ్ చేయడంలో లారెన్స్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఆ తర్వాత దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా అటు తమిళం, ఇటు తెలుగు ఇండస్ట్రీస్ లో బాగా గుర్తింపు తెచ్చుకున్నారు.
హారర్ కామెడీ జోనర్ లో ముని నుంచి వచ్చిన చిత్రాలు తెలుగు – తమిళ భాషలలో విడుదలై ప్రేక్షకులను మెప్పించాయి. ఈ క్రమంలో లారెన్స్ స్టార్ హీరోగా మారాడు. ఒకవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు దర్శకుడిగానూ కొనసాగుతూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నాడు. లారెన్స్ ప్రస్తుతం హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ‘రుద్రాన్’ సినిమాతో రాబోతున్న లారెన్స్, ‘అధికారం’ అనే మరో సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ క్రమంలోనే లారెన్స్ తాజాగా మరో కొత్త సినిమాను ప్రకటించాడు.
Raghava Lawrence : ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన రాఘవ లారెన్స్ ‘దుర్గ’
ఈ మేరకు ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ కూడా వదిలాడు. రెండు విభిన్నమైన గెటప్పులతో ఉన్న ఈ పోస్టర్ కి ఆయన అభిమానుల నుంచి మాత్రమే కాకుండా ప్రేక్షకుల నుంచి కూడా భారీ స్తాయిలో పాజిటివ్ రెస్పాన్ వస్తోంది. ‘దుర్గ’ అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా సోషల్ మీడియా ద్వారా తాజా పోస్టర్ ని రిలీజ్ చేశాడు లారెన్స్. ఆయన నటిస్తూ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఆయన గత చిత్రాల మాదిరిగానే హారర్ బ్యాక్ డ్రాప్ లో దుర్గ రూపొందనుంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పూర్తి వివరాలను, దర్శకుడు..ఇతర నటీ నటులను ప్రకటించనున్నాడు. మొత్తానికి ఫస్ట్ లుక్ తోనే ఆసక్తిని రేకెత్తించిన రాఘవ లారెన్స్ దుర్గ సినిమాతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!