NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నాం..రాహుల్ గాంధీ

Rahul Gandhi: తెలంగాణలో బీజేపీ బీ టీమ్ ను ఓడించాం.. ఇప్పుడు కేంద్రంలో బీజేపీని ఓడించబోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా రాహుల్ గాంధీ పార్టీ మ్యానిఫేస్టోను విడుదల చేశారు. తుక్కుగూడలో జరిగిన సభలో ఆయన న్యాయపత్రాన్ని ఆవిష్కరించారు. ఐదు గ్యారంటీల పత్రాన్ని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా విడుదల చేశారు.

తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, ఐదు వందలకే గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఐదు లక్షలు వంటి గ్యారంటీలను అమలు చేశామని అన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన గ్యారంటీలను అమలు చేశామని తెలిపారు. కొద్ది నెలల క్రితం ఇక్కడే తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మ్యానిఫేస్టోను విడుదల చేశానని ఆయన గుర్తు చేసుకున్నారు

తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నట్లుగానే జాతీయ స్థాయిలో కూడా గ్యారంటీలను అమలు చేస్తామని రాహుల్ స్పష్టం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీ మ్యానిఫేస్టో కాదని, ప్రజల గొంతుక అని అన్నారు. ఈ మ్యానిఫేస్టోలోనూ ఐదు గ్యారంటీలున్నాయని అన్నారు. అందులో ఒకటి దేశంలో నిరుద్యోగులందరికీ లక్ష రూపాయల జీతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని తెలిపారు.

దేశంలో యువతకు అప్రెంటిస్ కు నైపుణ్యంలో శిక్షణ ఇస్తామని తెలిపారు. దేశంలో ఉన్న నిరుద్యోగులందరికీ ఏడాది శిక్షణ ఇప్పించబోతున్నామని తెలిపారు. యువతకు సంబంధించిన మరికొన్ని కీలకమైన అంశాలను కూడా ఈ మ్యానిఫేస్టోలో పొందుపర్చామని వివరించారు.

మహిళలకు అవసరమైన పథకాలను కూడా తీసుకువస్తున్నామని తెలిపారు. మహిళ న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రతి మహిళ బ్యాంకు అకౌంట్ లో లక్ష రూపాయలు ఏడాదికి ఇవ్వనున్నామని తెలిపారు. ఇది విప్లవాత్మకమైన మార్పు అని అన్నారు. ఈ నిర్ణయంతో దేశం ముఖ చిత్రమే మారబోతుందని అన్నారు.

రైతులకు న్యాయం చేసేందుకు కూడా ఈ మ్యానిఫేస్టోలో ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. రైతులకు రుణమాఫీ చేయాలని నిర్ణయించామని అన్నారు. రైతు న్యాయం గ్యారంటీ కింద రుణ మాఫీ చేస్తామని తెలిపారు. కనీస మద్దతు ధరను కూడా ప్రతి పంటకు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఎంఎస్ స్వామినాధన్ సిఫార్సుల మేరకు మద్దతు ధరలను కల్పించబోతున్నామని రాహుల్ గాంధీ చెప్పారు.

కార్మికుల సంక్షేమం కోసం కనీస వేతనాలను తీసుకు వచ్చేలా చట్టం తీసుకువస్తామని రాహుల్ తెలిపారు. రోజుకు కనీస వేతనం నాలుగు వందలు ప్రకటిస్తామన్నారు. దేశంలో 90 శాతం ఉన్న పేదలందరికీ న్యాయంచేస్తామని అన్నారు. దేశంలో కులగణన చేయబోతున్నామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తామని తెలిపారు.

గత ముఖ్యమంత్రి నేతల ఫోన్లు ట్యాప్ చేసి అక్రమాలకు పాల్పడ్డారని అన్నారు. బలవంతపు వసూళ్లు చేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని అన్నారు. దీనిపై విచారణలో మరిన్ని విషయాలు బయటపడతాయని తెలిపారు. ఢిల్లీలో మోదీ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుందని అన్నారు. ఈడీ, సీబీఐ, ఐటీలను తమ జేబు సంస్థలుగా వినియోగించుకుంటుందని ఆరోపించారు. బీజేపీ పెద్ద వాషింగ్ మెషీన్ లాంటిదని, అత్యంత అవినీతి పరులందరూ మోదీ పక్కకు చేరితే నీతిపరులయిపోతున్నారని అన్నారు.

YSRCP: చంద్రబాబూ .. అభివృద్ధి చేసి ఉంటే పొత్తులు ఎందుకు – జగన్

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N