Enforcement Directorate: ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాత్కాలిక డైరెక్టర్ గా సీనియర్ ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ నియమితులైయ్యారు. ప్రస్తుత డైరెక్టర్ సంజయ్ కుమార్ మిశ్ర పదవీ కాలం నేటితో ముగియనున్న నేపథ్యంలో 1993 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి రాహుల్ నవీన్ ను ఆయన స్థానంలో కేంద్రం నియమించింది. రెగ్యులర్ డైరెక్టర్ నియామకంపై తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ ఈడీ ఇన్ చార్జి డైరెక్టర్ గా రాహుల్ వ్యవహరిస్తారని వెల్లడించింది. రాహుల్ నవీన్ గతంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో చీఫ్ విజిలెన్స్ అఫీసర్ గా కూడా పని చేశారు. స్పెషల్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
కాగా సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈడీ చీఫ్ సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం నేటితో ముగియనుంది. రెండు సార్లు సంజయ్ కుమార్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించడం విమర్శలకు దారి తీసింది. సుప్రీం కోర్టు కూడా తప్పుబట్టంది. ఆర్ధిక చర్యల కార్యదళం (ఎఫ్ఏటీఎఫ్) సమీక్ష కొనసాగుతున్నందున సంజయ్ కుమార్ మిశ్రా ను అక్టోబర 15వరకు కొనసాగించేందుకు అనుమతించాలని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును కోరినప్పటికీ అందుకు నిరాకరింలేదు. సెప్టెంబర్ 15 వరకూ మిశ్రా ఈడీ డైరెక్టర్ గా ఉండేందుకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది.

ఈడీ డైరెక్టర్ గా సంజయ్ కుమార్ మిశ్రా 2018లో నియమితులైయ్యారు. రెండేళ్ల తర్వాత (60 ఏళ్లు పూర్తి) అయిన పదవీ విరమణ చేయాల్సి ఉంది కానీ నవంబర్ 2020 లో ఆయన పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. అనంతరం 2022లోనూ మరో సారి కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇడీ చీఫ్ పదవీ కాలాన్ని వరుసగా పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత జయా ఠాకూర్ తో పాటు పలువురు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ల పై విచారణ జరిపిన సుప్రీం కోర్టు .. సంజయ్ కుమార్ మిశ్రా పదవీ కాలం పొడిగింపు కుదరదని స్పష్టం చేసింది. జూలై 31 తర్వాత ఆయన ఆ పదవిలో ఉండరాదని తేల్చి చెప్పింది. ఈ లోపుగా కొత్త అధిపతిని నియమించుకోవాలని కేంద్రాన్ని సూచించింది.
ఈడీ డైరెక్టర్ పదవీ కాలాన్ని పలు మార్లు పొడిగిస్తుండటంపై సుప్రీం కోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. పదేపదే పదవీ కాలాన్ని పొడిగిస్తుండటం చట్ట విరుద్దమని వ్యాఖ్యానించింది. ఈ క్రమంలో ప్రస్తుత చీఫ్ మినహా మొత్తం విభాగం అసమర్థతతో నిండి ఉందా అని సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. మిశ్రా అనివార్యమైన వ్యక్తి కాదనీ, కానీ.. ఎఫ్ఏటీఎఫ్ సమీక్ష కు ఆయన ఉండటం అవసరమని వివరించే ప్రయత్నం చేసిన కేంద్రం .. అక్టోబర్ 15వరకూ కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలని కోరిది. అయితే సుప్రీం ధర్మాసనం సెప్టెంబర్ 15 వరకూ ఆ పదవిలో మిశ్రా ఉండేందుకు అనుమతి ఇచ్చింది. నేటితో ఈడీ చీఫ్ పదవీ కాలం ముగుస్తున్నా కేంద్ర ప్రభుత్వం కొత్త చీఫ్ నియామకాన్ని జరపలేదు. ఈ క్రమంలో ఈడీ తాత్కాలిక డైరెక్టర్ గా రాహుల్ నవీన్ ను నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.
Nara Bhuvaneswari: చంద్రబాబుతో భువనేశ్వరి ములాఖత్ దరఖాస్తు తిరస్కరణ .. కారణం ఏమిటంటే..?