ఆర్ ఆర్ ఆర్ కు ఆచార్యకు మధ్య లింక్ పెట్టిన చిరు

మెగాస్టార్ చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రం తర్వాత కొంత గ్యాప్ తీసుకుని చేస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ ఈ చిత్రానికి దర్శకుడు. 2018లో భరత్ అనే నేను చిత్రాన్ని పూర్తి చేసాడు కొరటాల శివ. ఈ తర్వాత చిరంజీవి కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాడు. సైరా ఆలస్యమవ్వడంతో కొరటాల శివ ఎదురుచూపులు కూడా పెరిగాయి.

 

rajamouli gives permission for ram charan after chiranjeevi requests
rajamouli gives permission for ram charan after chiranjeevi requests

 

అయితే మొత్తానికి ఈ ఏడాది ప్రారంభంలో ఆచార్య సెట్స్ మీదకు వెళ్ళింది. అయితే కొద్ది రోజులు షూటింగ్ జరిగిందో లేదో ఆచార్య షూట్ కు బ్రేకులు పడ్డాయి. కరోనా మహమ్మారి విజృంభించడంతో చిరంజీవి మొదటగా ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఆచార్య షూట్ లాక్ డౌన్ సమయానికి 35 శాతం పూర్తయింది. మిగిలిన భాగం కోసం వచ్చే నెల నుండి షూట్ ను మొదలుపెడుతున్నారు. ఈ సినిమాపై అంచనాలు రెండింతలు అవ్వడానికి ప్రధాన కారణం ఇందులో రామ్ చరణ్ పోషించబోయే పాత్ర.

ఇప్పటిదాకా చిరంజీవి, రామ్ చరణ్ కలిసి మూడుసార్లు కనిపించారు. ఈ మూడు కూడా కామియో పాత్రలే. మగధీర, బ్రూస్ లీ, ఖైదీ నెం 150 సినిమాల్లో వీరు కలిసి కనిపించారు. అయితే ఈ మూడు సినిమాల్లో కూడా కొద్ది నిమిషాల పాటే కనిపిస్తారు. కానీ ఆచార్యలో అలా కాదు రామ్ చరణ్ దాదాపు 30 నుండి 45 నిముషాలు ఆచార్యలో కనిపిస్తాడు. చిరంజీవికి తెలుసు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదని. ఇద్దరూ కలిసి అంత సేపు స్క్రీన్ మీద కనిపించడం అనేది తన భార్య కల అని అంటున్నాడు చిరంజీవి.

ముందుగా రాజమౌళి ఇందుకు ఒప్పుకోలేదు. ఆర్ ఆర్ ఆర్ లో చరణ్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని ప్రచారం చేస్తున్నారు. ఒకవేళ ఆర్ ఆర్ ఆర్ కంటే ముందు ఆచార్య విడుదలైతే దానికి సంబంధించిన బజ్ పోతుందని రాజమౌళి అనుకున్నాడు. కానీ స్వయంగా చిరంజీవి పరిస్థితిని వివరించడంతో చివరికి ఎస్ చెప్పాడు రాజమౌళి. రామ్ చరణ్ ను ఆచార్యలో నటించడానికి అనుమతించాడు.