Ram charan : రామ్ చరణ్ Ram charan ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్ లో ఇంత శక్తి వంతమైన పాత్రలో మొదటిసారి పోషిస్తున్నాడు. ఇప్పటికే భీం ఫర్ రామరాజు గా రిలీజైన టీజర్ తో విపరీతంగా ఆకట్టుకున్నాడు. దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ పాన్ ఇండియన్ సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ కూడా కొమరం భీం గా నటిస్తున్నాడు. ఎన్.టి.ఆర్, చరణ్ లతో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మీద ప్రపంచ వ్యాప్తంగా ఊహించని స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమానే కాకుండా ఆచార్య అన్న సినిమాలో సిద్ద అన్న మరో పవర్ ఫుల్ రోల్ లో కూడా చరణ్ నటిస్తున్నాడు. రీసెంట్ గా ఈ ప్రాజెక్ట్ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. మెగాస్టార్ – కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న ఈ సినిమా కూడా మల్టీస్టారర్ గానే తెరకెక్కుతోంది. అంతేకాదు ఈ సినిమాలో చిరు తో కలిసి చరణ్ ఒకే ఫ్రేం లో కనిపించి అభిమానులని ఉర్రూతలూగిస్తారని దర్శకుడు కొరటాల శివ చెప్పుకొస్తున్నాడు. ఇక మణిశర్మ సంగీతం ఆచార్య సినిమాకి హైలెట్ గా నిలవబోతోందట.
Ram charan : చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది క్లారిటీ లేక సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్..!
కాగా చరణ్ నెక్స్ట్ సినిమా ఏంటన్నది క్లారిటీ లేక సోషల్ మీడియాలో రక రకాల రూమర్స్ వస్తున్నాయి. పలువు దర్శకులతో చరణ్ నెక్స్ట్ సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు. అయితే ప్రముఖంగా యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వంలో చరణ్ నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఫిల్మ్ సర్కిల్ లో టాక్ వినిపిస్తోంది. దాదాపు ఈ డైరెక్టర్ తోనే చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉంటుందని అంటున్నారు. వెంకీ కుడుముల ఇప్పటికే ఛలో.. భీష్మ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ అందుకున్నాడు. మరి వెంకీ కుడుముల – చరణ్ ల కాంబినేషన్ లోసినిమా నిజమే అయితే ఎలాంటి కథ తెర మీదకి తీసుకు వస్తాడో చూడాలి.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!